నోటిఫికేషన్స్‌

భారత ప్రభుత్వానికి చెందిన న్యూదిల్లీలోని నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ (ఇండియా) లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 05 May 2022 01:19 IST

ఉద్యోగాలు

ఎన్‌బీసీసీ (ఇండియా) లిమిటెడ్‌లో...

భారత ప్రభుత్వానికి చెందిన న్యూదిల్లీలోని నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ (ఇండియా) లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 23

పోస్టులు: జనరల్‌ మేనేజర్లు, అడిషనల్‌ జనరల్‌ మేనేజర్లు, ప్రాజెక్ట్‌ మేనేజర్లు.

విభాగాలు: ఇంజినీరింగ్‌, మార్కెటింగ్‌, సివిల్‌

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, మే 09.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 08.

వెబ్‌సైట్‌: www.nbccindia.com/


ఆర్మీ- సదరన్‌ కమాండ్‌లో...

పుణె కంటోన్మెంట్‌ (మహారాష్ట్ర)లోని సదరన్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టులు

మొత్తం ఖాళీలు: 58

పోస్టులు: సఫాయివాలా, డ్రైవర్లు, ఎల్‌డీసీ.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత. ఇంగ్లిష్‌ టైపింగ్‌తో పాటు వాలిడ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి.

వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఫిజికల్‌ టెస్ట్‌/ ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://indianarmy.nic.in/


టీఎంసీలో 22 పోస్టులు

టాటా మెమోరియల్‌ సెంటర్‌ కింది నాన్‌ మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి.

మొత్తం ఖాళీలు: 22

పోస్టులు: క్వాలిటీ మేనేజర్‌, సైంటిఫిక్‌ ఆఫీసర్‌, మెడికల్‌ ఫిజిసిస్ట్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్లు, టెక్నీషియన్లు తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌, డిప్లొమా బీఎస్సీ, జీఎన్‌ఎం, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ/ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 28.

వెబ్‌సైట్‌: https://tmc.gov.in/


ప్రవేశాలు

ఐఐఎం ఇండోర్‌లో ఎమ్మెస్సీ ప్రోగ్రాం

ఇండోర్‌ (మధ్యప్రదేశ్‌)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సంయుక్తంగా 2022 సంవత్సరానికి గాను కింది ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నాయి.

* మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (డేటా సైన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌)

మొత్తం సీట్లు: 200

కోర్సు వ్యవధి: రెండేళ్లు

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత. క్యాట్‌/ గేట్‌/ జీమ్యాట్‌/ జీఆర్‌ఈ/ జామ్‌ స్కోర్‌.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 10.

వెబ్‌సైట్‌: https://msdsm.iiti.ac.in/


బార్క్‌లో పోస్ట్‌ ఎమ్మెస్సీ డిప్లొమా

భారత ప్రభుత్వానికి చెందిన భాభా అటమిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) 2022 విద్యాసంవత్సవరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

* పోస్ట్‌ ఎమ్మెస్సీ డిప్లొమా (రేడియోలాజికల్‌ ఫిజిక్స్‌)

కోర్సు వ్యవధి: ఏడాది.

అర్హత: ఫిజిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత.

స్టైపెండ్‌: నెలకు రూ.25000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 20.

రాత పరీక్ష తేది: 2022, జూన్‌ 26.

వెబ్‌సైట్‌: https://barc.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని