దేశంలోనే మొదటి 5జీ టెస్ట్‌బెడ్‌ ప్రారంభం

స్థానికంగా అంకుర సంస్థలు, పరిశ్రమ వర్గాలు తమ ఉత్పత్తులను పరీక్షించేందుకు వీలుగా దేశంలోనే మొదటి 5జీ టెస్ట్‌బెడ్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. విదేశీ కేంద్రాలపై

Published : 19 May 2022 01:59 IST

ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల ప్రత్యేకం!

కరెంట్‌ అఫైర్స్‌

స్థానికంగా అంకుర సంస్థలు, పరిశ్రమ వర్గాలు తమ ఉత్పత్తులను పరీక్షించేందుకు వీలుగా దేశంలోనే మొదటి 5జీ టెస్ట్‌బెడ్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. విదేశీ కేంద్రాలపై ఆధారపడటాన్ని ఇది తగ్గిస్తుంది. దాదాపు రూ.220 కోట్ల వ్యయంతో ఈ టెస్ట్‌బెడ్‌ను ఏర్పాటు చేశారు.

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన రెండు యుద్ధనౌకలను రక్షణ మంత్రి   రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు. ఇందులోని ఒక షిప్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని పర్వతశ్రేణి పేరిట ‘ఉదయగిరి’ అనినామకరణం చేశారు. రెండో యుద్ధనౌకకు ‘సూరత్‌’ అని పేరుపెట్టారు.

మతమార్పిడి నిషేధ ఆర్డినెన్స్‌కు కర్ణాటక గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లోత్‌ ఆమోద ముద్రవేశారు. విధాన సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును విధాన పరిషత్తులో అధికార పక్షానికి సంఖ్యాబలం లేకపోవడంతో ప్రవేశపెట్టలేదు. ఫలితంగా ఆర్డినెన్స్‌ ద్వారా చట్టబద్ధత కల్పించారు.

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం సీజేగా ఉన్న జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మను దిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రతిపాదించింది.

సింగరేణికి జియోమైన్‌ టెక్‌ విబ్జియార్‌ గోల్డెన్‌ రెయిన్‌ బో పురస్కారంతో పాటు సంస్థ సంచాలకులు చంద్రశేఖర్‌కు ఇన్నోవేటివ్‌ లీడర్‌ షిప్‌, బలరామ్‌కు ఎన్విరాన్‌మెంట్‌ ఎక్స్‌లెన్స్‌ పురస్కారం లభించాయి. భువనేశ్వర్‌లో జరిగిన 22వ అంతర్జాతీయ జియోమైన్‌ టెక్‌ సదస్సులో వీటిని ప్రదానం చేశారు.

జమైకా రాజధానిలోని డౌన్‌టౌన్‌ కింగ్‌స్టన్‌లో ఒక వీధికి భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్‌.అంబేడ్కర్‌ పేరు పెట్టారు. రాజ్యాంగ రూపకల్పనలో ఆయన కృషికి గుర్తింపుగా అక్కడే ఒక స్మారకాన్ని కూడా నిర్మించారు.

సొంత పార్లమెంటరీ పార్టీల మార్గదర్శకాలకు వ్యతిరేకంగా వేసే ఓట్లు  పరిగణనలోకి తీసుకోవద్దంటూ పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు చెప్పింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని