నోటిఫికేషన్స్‌

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) వాటర్‌ వింగ్‌ విభాగం కింది గ్రూప్‌ బీ, సీ కంబాటైజ్డ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 24 May 2022 01:23 IST

ఉద్యోగాలు

బీఎస్‌ఎఫ్‌లో 281 పోస్టులు

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) వాటర్‌ వింగ్‌ విభాగం కింది గ్రూప్‌ బీ, సీ కంబాటైజ్డ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 281 ఎస్‌ఐ (మాస్టర్‌), ఎస్‌ఐ (ఇంజిన్‌ డ్రైవర్‌), ఎస్‌ఐ (వర్క్‌షాప్‌), హెడ్‌ కానిస్టేబుల్‌ (మాస్టర్‌), హెడ్‌ కానిస్టేబుల్‌ (ఇంజిన్‌ డ్రైవర్‌), హెడ్‌ కానిస్టేబుల్‌ (వర్క్‌షాప్‌ ట్రేడ్‌), సీటీ క్రూ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: పోస్టుల్ని అనుసరించి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in/


ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్లు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కి చెందిన సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌, ప్రమోషన్‌ విభాగం రెగ్యులర్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్లు

మొత్తం ఖాళీలు: 32. అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్లు, మేనేజర్లు, డిప్యూటీ మేనేజర్లు.

విభాగాలు: టెక్నికల్‌ ఆపరేషన్స్‌, ఇన్‌బౌండ్‌ ఇంజినీర్‌, సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌, నెట్‌వర్క్‌ ఇంజినీర్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 12.

వెబ్‌సైట్‌: https://sbi.co.in/


డీఎంహెచ్‌ఓ, కృష్ణా జిల్లాలో...

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కార్యాలయం (డీఎంహెచ్‌ఓ) నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ప్రోగ్రాం ద్వారా ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 126. కార్డియాలజిస్టులు, మెడికల్‌ ఆఫీసర్లు, స్పెషలిస్ట్‌ మెడికల్‌ ఆఫీసర్లు తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 25.

వెబ్‌సైట్‌: https://krishna.ap.gov.in/


ఎన్‌టీపీసీలో అసిస్టెంట్‌ ఆఫీసర్లు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* అసిస్టెంట్‌ ఆఫీసర్లు (ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌)

మొత్తం ఖాళీలు: 10

అర్హత: గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ (ఎన్విరాన్‌మెంట్‌)/ తత్సమాన ఉత్తీర్ణత.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 03.

వెబ్‌సైట్‌: https://www.ntpc.co.in/


ప్రవేశాలు

నల్సార్‌, హైదరాబాద్‌లో....

హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా కు చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ (డీడీఈ), సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ అండ్‌ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ (సీడీఓఈ) 2022-2023 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

* నల్సార్‌లో ఎంఏ, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ప్రోగ్రాములు

1) ఎంఏ (రెండేళ్లు): సెక్యూరిటీ అండ్‌ డిఫెన్స్‌ లా, మారిటైం లా, యానిమల్‌ ప్రొటెక్షన్‌ లా తదితరాలు 2) అడ్వాన్స్‌ డిప్లొమా (ఏడాది): పేటెంట్స్‌ లా, సైబర్‌ లా, మీడియా లా తదితరాలు.

అర్హత: ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, జులై 15.

వెబ్‌సైట్‌: www.nalsar.ac.in/


వాక్‌ఇన్‌

సీఈసీఆర్‌ఐలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

తమిళనాడులోని సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ ఎలక్ట్రో కెమికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 17.

ఖాళీలు: ప్రాజెక్ట్‌ అసోసియేట్లు-10, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్లు-06, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌)-01.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఈ/ బీటెక్‌, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత, అనుభవం.

వాక్‌ఇన్‌ తేదీలు: 2022, జూన్‌ 07-09. వేదిక: సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ ఎలక్ట్రో కెమికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, కరైకుడి, తమిళనాడు.

వెబ్‌సైట్‌: https://www.cecri.res.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని