ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

ఏ వయసులోపువారు పోలీస్‌ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు?...

Published : 24 May 2022 01:38 IST

ఏ వయసులోపువారు పోలీస్‌ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు?

 - సుతారి

జ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 మే 20న పోలీసు ఉద్యోగాలకు వయసు పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిప్రకారం ప్రస్తుతం కానిస్టేబుల్‌ ఉద్యోగాల ఎంపికకు గరిష్ఠ వయసు సాధారణ కేటగిరీలో 27 సంవత్సరాలు. ఏదైనా రిజర్వేషన్‌ ఉంటే మరొక అయిదేళ్లు సడలింపు ఉంటుంది. ఎస్సై ఉద్యోగాల ఎంపికకు గరిష్ఠ వయసు పరిమితి సాధారణ కేటగిరీలో 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వ్‌డ్‌ అభ్యర్థులకు గరిష్ఠ వయసు  35 ఏళ్లు. దరఖాస్తు గడువును ప్రభుత్వం 2022 మే 26 వరకు పెంచింది.


నేను ప్రభుత్వ ఉద్యోగిని. సాలీనా జీతం రూ.10 లక్షలు. బీసీ-డీ కేటగిరీ కిందకు వస్తాను. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 దరఖాస్తులో నాన్‌ క్రీమీలేయర్‌ అని నింపాను. ఎడిట్‌ చేసి క్రీమీలేయర్‌ అని నింపి మరొకసారి సబ్మిట్‌ చేయవచ్చా?

- సిహెచ్‌. బాలకృష్ణ

జ: టీఎస్‌పీఎస్సీ ఓటీఆర్‌లో ఎడిట్‌ ఆప్షన్‌కు వెళ్లి ఏవైనా తప్పులు ఉంటే సవరించి దరఖాస్తును మరొకసారి సబ్మిట్‌ చేయవచ్చు.


పదో తరగతి, ఇంటర్మీడియట్‌ చదవకుండా ఎస్‌డీఎల్‌సీఈ కాకతీయ యూనివర్సిటీ వరంగల్‌ నుంచి దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేశాను. రెగ్యులర్‌ పీజీ ఎంఏ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, బీఈడీ చేశాను. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షలు రాసేందుకు అర్హత ఉందా?

- అనన్య అరికిల్లా

జ: దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేసినవారికి కూడా టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షలు రాసేందుకు అర్హత ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని