ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి వరకు స్వస్థలమైన జోగులాంబ గద్వాలలో; అయిదో తరగతి నుంచి పదో తరగతి వరకు వనపర్తిలో చదివాను. అయితే అయిదో తరగతి రెండు సార్లు

Published : 27 May 2022 03:26 IST

ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి వరకు స్వస్థలమైన జోగులాంబ గద్వాలలో; అయిదో తరగతి నుంచి పదో తరగతి వరకు వనపర్తిలో చదివాను. అయితే అయిదో తరగతి రెండు సార్లు చదివినట్లయ్యింది. ఈ తరగతికి సంబంధించిన బోనఫైడ్‌ను వనపర్తి నుంచే తీసుకున్నాను. ఉద్యోగం, స్థానికత విషయంలో ఏదైనా సమస్య వస్తుందా?  

- వీరేశ్‌

జ: ఉద్యోగం, స్థానికత విషయంలో ఎలాంటి సమస్య ఉండదు. గద్వాల జిల్లాలో ఎక్కువ కాలం చదివారు కాబట్టి మీరు ఆ ప్రాంతంలో స్థానికతను పొందుతారు.


తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేశాను. నాకు ఎత్తు  విషయంలో సందేహాలు ఉన్నాయి. శారీరక కొలతల వివరాలను తెలిపే ప్రామాణిక కేంద్రాలు ఏవైనా ఉంటాయా?

- ఒక అభ్యర్థి

జ: తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి కనీసఎత్తు సాధారణ కేటగిరీలో పురుషులకు 167.6 సెం.మీ., మహిళలకు 152.5 సెం.మీ. శారీరక కొలతల వివరాలను తెలిపే ప్రామాణిక కేంద్రాలు ఏవీ ప్రత్యేకంగా ఉండవు.


ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ,   గ్రూప్‌-1కి ప్రిపేర్‌ అవుతున్నాను. నేను క్రీమీలేయర్‌ పరిధిలోకి వస్తానా లేదా నాన్‌ క్రీమీలేయర్‌ కిందకి వస్తానా?

- వీరశేఖర్‌

జ: కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.8 లక్షలు లేదా అంతకు మించితే క్రీమీలేయర్‌ పరిధిలోకి వస్తారు. లేదంటే నాన్‌ క్రీమీలేయర్‌ అవుతారు. క్రీమీలేయర్‌ కిందికి వచ్చే వారికి రిజర్వేషన్‌ వర్తించదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని