ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

సాధారణంగా పోటీ పరీక్షల్లో ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, చరిత్ర నాలుగు ముఖ్యమైన సబ్జెక్టులుగా ఉంటాయి. కొత్తగా ప్రిపరేషన్‌ మొదలుపెట్టిన అభ్యర్థి వీటిని ఏ ప్రాధాన్య క్రమంలో చదివితే

Published : 28 May 2022 02:40 IST

సాధారణంగా పోటీ పరీక్షల్లో ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, చరిత్ర నాలుగు ముఖ్యమైన సబ్జెక్టులుగా ఉంటాయి. కొత్తగా ప్రిపరేషన్‌ మొదలుపెట్టిన అభ్యర్థి వీటిని ఏ ప్రాధాన్య క్రమంలో చదివితే ఉపయుక్తంగా ఉంటుంది?

-జార్జి బాల జేవై

జ: మీ ఆసక్తిని బట్టి ముందుగా ఏ సబ్జెక్టు అయినా చదవచ్చు. అంశాలను అర్థం చేసుకుని ప్రిపేర్‌ అవడమే ముఖ్యం.


 ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు సూర్యాపేట జిల్లాలో చదివాను. నాలుగో   తరగతి చదవకుండా అయిదో తరగతి నుంచి ఏడో తరగతి వరకు నల్గొండ జిల్లాలో చదువుకున్నాను. నేను ఏ జిల్లాలో స్థానికత పొందుతాను?

- రమేష్‌

జ: మీరు నల్గొండ జిల్లాలో స్థానికత పొందుతారు.


గ్రూప్‌-1 మెయిన్స్‌కు ఎలా ప్రిపేర్‌ అవ్వాలి? కోచింగ్‌ అవసరం ఉంటుందా?  

-సంజీవ్‌

జ: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రిపరేషన్‌ ప్రారంభించినప్పుడే మెయిన్స్‌కు కూడా సన్నద్ధత మొదలుపెట్టాలి. తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా చేసుకుని నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవాలి. ముందుగా క్లిష్టమైన సబ్జెక్టులను బాగా అర్థం చేసుకుని చదవాలి. తయారు చేసుకున్న నోట్స్‌ను ఎక్కువసార్లు రివిజన్‌ చేయాలి. అవగాహన కోసం పాత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. సబ్జెక్టులన్నిటిపై పట్టు ఉందనుకుంటే కోచింగ్‌ అవసరం ఉండదు.

మీ సందేహాలను పోస్ట్‌ చేయడానికి క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.

help@eenadupratibha.net


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని