కరెంట్‌ అఫైర్స్‌

తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ దావోస్‌ పర్యటన ముగిసింది. దీని ద్వారా రూ.4200 కోట్లకుపైగా పెట్టుబడులను సమీకరించినట్లు ఆయన వెల్లడించారు. 45 ప్రసిద్ధ  సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.

Published : 29 May 2022 00:53 IST

తెలంగాణలో రూ.4200 కోట్లకు పైగా పెట్టుబడులు

తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ దావోస్‌ పర్యటన ముగిసింది. దీని ద్వారా రూ.4200 కోట్లకుపైగా పెట్టుబడులను సమీకరించినట్లు ఆయన వెల్లడించారు. 45 ప్రసిద్ధ  సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.
మిగులు విద్యుత్తు రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 2014, జూన్‌ 2 నుంచి 2022 ఏప్రిల్‌ 1 వరకు 7,778 నుంచి 17,305 మెగావాట్లకు పెరిగిందని పేర్కొంది. తలసరి కరెంటు వినియోగంలో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచినట్లు తెలిపింది.

తీవ్ర సంక్షోభ సమయంలో కీలక రాజ్యాంగ సవరణకు శ్రీలంక రాజకీయ అగ్ర నేతలు అంగీకరించారు. ఈ మేరకు దేశాధ్యక్షుడికి ఉన్న అపరిమిత అధికారాలను నియంత్రించే 21వ రాజ్యాంగ సవరణకు వీలయినంత త్వరలో ఆమోదం తెలపాలని నిర్ణయించారు.
ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం పౌరస్మృతి అమలుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌ నేతృత్వం వహిస్తారు.

క్రెడిట్‌ కార్డు, బ్యాంకు ఖాతాల పాస్‌వర్డ్‌, వ్యక్తిగత సమాచారాల డిజిటల్‌ డేటాను సురక్షితంగా భద్రపరిచే అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ చిప్‌ను బెంగళూరుకు చెందిన భారతీయ విజ్ఞాన సంస్థ   రూపొందించింది.
వరి పంటను పండించడంలో ఎదురయ్యే నీటి కొరతను అధిగమించడానికి ‘ఓఎస్‌ఆర్‌ఐఎన్‌జీజడ్‌ఎఫ్‌1’ అనే ఒక జన్యువును చైనాలోని షాంఘై ఆగ్రోబయలాజికల్‌ జీన్‌సెంటర్‌ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని