ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

పదోతరగతి మెమోలో నా పేరు కె.అచ్యుతరావు అని, డిగ్రీ సర్టిఫికెట్‌లో కందుల అచ్యుతరావు అని ఉంది. టీఎస్‌పీఎస్సీ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ సమయంలో ఏదైనా సమస్య ఉంటుందా?

Updated : 25 Jun 2022 04:01 IST

* పదోతరగతి మెమోలో నా పేరు కె.అచ్యుతరావు అని, డిగ్రీ సర్టిఫికెట్‌లో కందుల అచ్యుతరావు అని ఉంది. టీఎస్‌పీఎస్సీ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ సమయంలో ఏదైనా సమస్య ఉంటుందా?

- కె.అచ్యుతరావు

జ: ఎలాంటి సమస్య ఉండదు. ఏ సందేహం లేకుండా టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు బాగా ప్రిపేర్‌ అవ్వండి.



* టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో గ్రూప్‌-2 ఇండియన్‌ ఎకానమీ సిలబస్‌లో ఇండియన్‌ అగ్రికల్చర్‌, ఎల్‌పీజీ 1991, మనీ అండ్‌ ఇన్‌ఫ్లేషన్‌, ఆర్‌బీఐ, మానిటరీ పాలసీ, బడ్జెట్‌, ఎకనామిక్‌ సర్వే, ఐఎంఎఫ్‌, వరల్డ్‌ బ్యాంక్‌ అంశాలు ఎక్కడా కనిపించలేదు. పరీక్షకు వాటిని చదవాలా?      

- ఇమ్మాన్యుయేల్‌

జ: ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ అనే టాపిక్‌లోనే ఈ అంశాలన్నీ ఉంటాయి. కాబట్టి, మీరు వాటన్నింటినీ చదవాల్సిందే.


* నేను ఒకటి నుంచి ఆరో తరగతి వరకు  మేడ్చల్‌లో, ఏడో తరగతి నుంచి పదో తరగతి రంగారెడ్డిలో, ఇంటర్‌, డిగ్రీ మేడ్చల్‌లో పూర్తిచేశాను. నేను ఏ జిల్లాలో స్థానికతను పొందుతాను?  

  - శ్రవణ్‌

జ: మీ ప్రాథమిక విద్య అంతా మేడ్చల్‌లోనే ఎక్కువ కాలం సాగింది కాబట్టి, మీరు అక్కడి స్థానికతనే పొందుతారు.


మీ సందేహాలను పోస్ట్‌ చేయడానికి క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని