ఈ డిగ్రీ చెల్లుతుందా?

ఇంటర్‌ (ఎంపీసీ) 2010-2011లో పాసయ్యాను. 2017-20లో దూరవిద్య ద్వారా బీఏ చేశాను. పోటీ పరీక్షలకు దరఖాస్తు చేయడానికి ఈ డిగ్రీ చెల్లుతుందా?

Published : 27 Jun 2022 01:31 IST

ఇంటర్‌ (ఎంపీసీ) 2010-2011లో పాసయ్యాను. 2017-20లో దూరవిద్య ద్వారా బీఏ చేశాను. పోటీ పరీక్షలకు దరఖాస్తు చేయడానికి ఈ డిగ్రీ చెల్లుతుందా?

- ఎస్‌. మాధవి

మీరు ఇంటర్మీడియట్‌ని 2011లో పూర్తిచేసి, డిగ్రీని 2020లో చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందీ లేదు. ఏ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్‌లోనూ రెండు కోర్సుల మధ్య విరామం గురించి ప్రత్యేకంగా అడగరు. డిగ్రీ అర్హత ఉన్న అన్నిరకాల ఉద్యోగాలకూ దూరవిద్యలో డిగ్రీ చదివినవారు అర్హులే. ఏదైనా నోటిఫికేషన్‌ వచ్చినప్పుడు ఆయా ఉద్యోగాలకు మీ అర్హతను నిర్థరించుకోండి. ఆపై నిరభ్యంతరంగా దరఖాస్తు చేసుకోండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని