పాఠాలు చెప్పే భూగోళం

జాగ్రఫీని థియరీలా నేర్చుకోవడం అంటే స్కూల్‌ విద్యార్థులకు అంత ఆసక్తిగా ఉండదు. అదే అనుభవ పూర్వకంగా చదివిస్తే ఉత్సాహం చూపిస్తారు. అందుకే గతంలో గ్లోబ్‌, అట్లాస్‌లు వాడేవారు. కానీ ఇప్పుడు వాటి స్థానంలో స్మార్ట్‌ గ్లోబ్స్‌ వస్తున్నాయి.

Updated : 25 Jul 2022 22:59 IST

విద్యార్థి నేస్తం

జాగ్రఫీని థియరీలా నేర్చుకోవడం అంటే స్కూల్‌ విద్యార్థులకు అంత ఆసక్తిగా ఉండదు. అదే అనుభవ పూర్వకంగా చదివిస్తే ఉత్సాహం చూపిస్తారు. అందుకే గతంలో గ్లోబ్‌, అట్లాస్‌లు వాడేవారు. కానీ ఇప్పుడు వాటి స్థానంలో స్మార్ట్‌ గ్లోబ్స్‌ వస్తున్నాయి. తయారీ సంస్థ యాప్‌ సాయంతో పనిచేసే వీటిపై దేశాల పేర్లు, విభజన రేఖల వంటివి ఉండవు...

మనం ఏ ప్రాంతం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నామో దాన్ని మొబైల్‌, ట్యాబ్‌లో యాప్‌ తెరిచి స్కాన్‌ చేస్తే మొత్తం ఆ ప్రాంత వివరాలన్నీ 3డీలో కనిపిస్తాయి. అక్కడ ఉండే జంతువులు, పురాతన కట్టడాలు, దొరికే ఆహారం, కళలు, ఆవిష్కరణలు... ఇలా విభాగాలవారీగా అన్ని విషయాలూ నేర్చుకోవచ్చు. ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ డివైజ్‌లతో ఈ యాప్‌ పనిచేస్తుంది. ఇంటరాక్టివ్‌ విధానంలో పాఠాలు నేర్పించే ఈ గ్లోబ్స్‌లో కొన్ని స్మార్ట్‌ పెన్‌, ఇతర ఫీచర్లతో కూడా వస్తున్నాయి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని