ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

దూరవిద్యావిధానంలో వేరే రాష్ట్రంలో డిగ్రీ పూర్తి చేశాను. టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌, పోలీసు ఉద్యోగాలు రాసుకోవడానికి అర్హత ఉంటుందా?

Published : 30 Jun 2022 01:48 IST

దూరవిద్యావిధానంలో వేరే రాష్ట్రంలో డిగ్రీ పూర్తి చేశాను. టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌, పోలీసు ఉద్యోగాలు రాసుకోవడానికి అర్హత ఉంటుందా?

- పొన్నం

జ: ప్రాథమిక విద్య అంతా తెలంగాణలోనే జరిగి ఉంటే డిగ్రీ వేరే రాష్ట్రంలో చేసినా మీకు అర్హత ఉంటుంది.


నేను ఒకటి నుంచి ఆరో తరగతి వరకు హన్మకొండలో, ఏడో తరగతి వరంగల్‌లో పూర్తి చేశాను. ఏ జిల్లా స్థానికత వర్తిస్తుంది?

- రంజిత్‌

జ: మీరు హన్మకొండలో స్థానికత పొందుతారు.


నేను టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నాను. నా ఎడమచేతికి 5 సెం.మీ. పొడవున అమ్మానాన్న అని పచ్చబొట్టు వేయించుకున్నాను. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగానికి కూడా దరఖాస్తు చేశాను. ఉద్యోగ సాధనలో ఈ పచ్చబొట్టు వ్లల ఏదైనా సమస్య ఉంటుందా?

- చిన్ని

జ: మీరు వేయించుకున్న పచ్చబొట్టు వల్ల ఉద్యోగ సాధనలో ఎలాంటి సమస్యా ఉండదు.


నేను ఎస్సీ గురుకులంలో 2019 నుంచి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాను. గ్రూప్‌ -1 పరీక్షకు ప్రిపేర్‌ అవుతున్నాను. మెయిన్స్‌ పూర్తయ్యేవరకు లాస్‌ ఆఫ్‌ పే సెలవులను పెట్టాలనుకుంటున్నాను. ఇందుకు ఎవరిని సంప్రదించాలి?

- షుకా

జ: మీ స్కూలు ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించి పై అధికారికి సెలవుల కోసం దరఖాస్తు చేసుకోండి.


మీ సందేహాలను పోస్ట్‌ చేయడానికి క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి

help@eenadupratibha.net


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని