ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

టీఎస్‌పీఎస్సీ ఏఈ సివిల్‌ ఇంజినీర్‌ ఉద్యోగానికి ప్రిపేర్‌ అవుతున్నాను. 2019లో నా మీద చిన్న కేసు నమోదైంది. ఇంకా నడుస్తోంది. ఒకవేళ ఉద్యోగం వచ్చి వెరిఫికేషన్‌ సమయానికి నాపై కేసు కన్‌ఫర్మ్‌ అయితే ఏదైనా సమస్య....

Published : 01 Jul 2022 00:06 IST

టీఎస్‌పీఎస్సీ ఏఈ సివిల్‌ ఇంజినీర్‌ ఉద్యోగానికి ప్రిపేర్‌ అవుతున్నాను. 2019లో నా మీద చిన్న కేసు నమోదైంది. ఇంకా నడుస్తోంది. ఒకవేళ ఉద్యోగం వచ్చి వెరిఫికేషన్‌ సమయానికి నాపై కేసు కన్‌ఫర్మ్‌ అయితే ఏదైనా సమస్య వస్తుందా?

- సాకాని నాగరాజు

జ: న్యాయస్థానంలో శిక్ష ఖరారు అయితే ఇబ్బంది ఉంటుంది. అన్ని విషయాలను మీరు కమిషన్‌కు వెల్లడించాల్సి ఉంటుంది.


నేను గ్రూప్‌-1 కి సిద్ధమవుతున్నాను. 2021లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికిపోయాను. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగసాధనలో ఏదైనా సమస్య ఉంటుందా?  

- మధు

జ: సాధారణ పరిస్థితులే అయితే ఏ సమస్యా ఉండకపోవచ్చు.


నేను ఆంధ్ర అమ్మాయిని. తెలంగాణ అబ్బాయితో వివాహం జరిగింది. ఆధార్‌ కార్డు ఇక్కడి అడ్రస్‌కి మార్పించుకున్నాను. టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాసేందుకు అర్హత ఉంటుందా?

- ఒక అభ్యర్థిని

జ: మీ ప్రాథమిక విద్యాభ్యాసమంతా ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగి ఉంటే,  తెలంగాణలో ఓపెన్‌ కోటాలో టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాసుకోవచ్చు. కానీ 5% ఉద్యోగాలకు మాత్రమే అర్హత ఉంటుంది.

మీ సందేహాలను పోస్ట్‌ చేయడానికి క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.
help@eenadupratibha.net


ప్రిపరేషన్‌టెక్నిక్‌

ఏదైనా సబ్జెక్టును విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలను కున్నప్పుడు చదివినంత వరకు ముఖ్యాంశాలను సొంత వాక్యాల్లో రాయడానికి ప్రయత్నించాలి. అర్థమైన మేరకు స్థూలంగా పునశ్చరణ చేసుకోవాలి. అప్పుడు టాపిక్‌పై పట్టు పెరుగుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని