ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

ఇటీవల జరిగిన టెట్‌లో నాకు మంచి మార్కులు వచ్చాయి. డీఎస్సీ రాసి టీచర్‌ కావాలన్నది నా కల. అయితే నోటిఫికేషన్‌ రావడానికి సమయం పడుతుందేమో అని పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ప్రిపేర్‌ అవుతున్నాను.

Published : 02 Jul 2022 00:17 IST

ఇటీవల జరిగిన టెట్‌లో నాకు మంచి మార్కులు వచ్చాయి. డీఎస్సీ రాసి టీచర్‌ కావాలన్నది నా కల. అయితే నోటిఫికేషన్‌ రావడానికి సమయం పడుతుందేమో అని పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ప్రిపేర్‌ అవుతున్నాను. ఒకవేళ డీఎస్సీ ప్రకటన కూడా విడుదలైతే పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిపరేషన్‌ని మధ్యలో వదిలేసి డీఎస్సీకి చదవాలా? పరిష్కార మార్గం చూపించండి.

- శ్రీధర్‌ రెడ్డి 

జ: పోలీస్‌ కానిస్టేబుల్‌ పరీక్షలు ఆగస్టులోనే పూర్తవుతాయి. ఆ తర్వాత మీరు డీఎస్సీకి ప్రిపేర్‌ కావచ్చు. కాబట్టి, కంగారు పడకుండా కానిస్టేబుల్‌ పరీక్షకు ప్రిపరేషన్‌ను కొనసాగించండి.

ప్రస్తుతం డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాను. గ్రూప్‌-4కి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందా?

- యోగేష్‌

జ: మీరు ఇంటర్‌ రెగ్యులర్‌గా చేసి డిగ్రీ చదువుతుంటే నిస్సంకోచంగా గ్రూప్‌-4కి దరఖాస్తు చేసుకోవచ్చు.

నేను మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేశాను. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసే గ్రూప్స్‌ ఉద్యోగ పరీక్షలకు నాకు అర్హత ఉంటుందా? ఇంకా ఏయే ఉద్యోగాలకు నేను దరఖాస్తు చేసుకోవచ్చు?

- విజయ్‌

జ: రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసే గ్రూప్స్‌ ఉద్యోగ పరీక్షల్లో మీకు గ్రూప్‌-4కి మాత్రమే అవకాశం ఉంటుంది. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ పోలీస్‌ కానిస్టేబుల్, కేంద్ర ప్రభుత్వం, ఎస్‌ఎస్‌సీ ప్రకటించే కొన్ని ఉద్యోగాలకు కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.

help@eenadupratibha.net


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని