నోటీస్‌బోర్డు
భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన నోయిడా ప్రధానకేంద్రంగా ఉన్న నవోదయ విద్యాలయ సమితి (ఎన్వీఎస్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ప్రభుత్వ ఉద్యోగాలు
నవోదయ విద్యాలయాల్లో 1616 ఖాళీలు
భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన నోయిడా ప్రధానకేంద్రంగా ఉన్న నవోదయ విద్యాలయ సమితి (ఎన్వీఎస్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 1616. ప్రిన్సిపల్-12, పీజీటీ-397, టీజీటీ-683, టీజీటీ (థర్డ్ లాంగ్వేజ్)-343, మిసిలీనియర్ కేటగిరి (ఆర్ట్, పీఈటీ, లైబ్రేరియన్)-181
అర్హత: పోస్టుల్ని అనుసరించి డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణత.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ/ పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 22.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) తేదీ: వెల్లడించాల్సి ఉంది.
వెబ్సైట్: https://navodaya.gov.in/
సీ-డ్యాక్‌లో 650 పోస్టులు
భారత ప్రభుత్వానికి చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ-డ్యాక్) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సీ-డ్యాక్ కేంద్రాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 650. ప్రాజెక్ట్ అసోసియేట్లు-50, ప్రాజెక్ట్ ఇంజినీర్లు-400, ప్రాజెక్ట్ మేనేజర్లు-50, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్లు-150.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ తత్సమాన ఉత్తీర్ణత.
ఎంపిక: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 20.
వెబ్సైట్: https://careers.cdac.in/
ఇండియన్ నేవీ - 2800 పోస్టులు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ నేవీ అగ్నిపథ్ స్కీమ్ ద్వారా అర్హులైన అవివాహిత స్త్రీ, పురుషుల నుంచి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* అగ్నివీర్ (ఎస్ఎస్ఆర్) - 01/ 2022 బ్యాచ్
మొత్తం పోస్టులు: 2800 (ఇందులో స్త్రీలకు 560 పోస్టులు)
అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్(10+2) ఉత్తీర్ణత.
వయసు: అభ్యర్థులు 01 నవంబరు 1999 - 30 ఏప్రిల్ 2005 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ), మెడికల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, జులై 15.
దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 22.
వెబ్సైట్: https://www.joinindiannavy.gov.in/
ప్రవేశాలు
ఆర్జీయూకేటీ, బాసరలో...
బాసర (తెలంగాణ)లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) 2022-2023 విద్యాసంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
* ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రాం 2022-23
కోర్సు వ్యవధి: ఆరు సంవత్సరాలు.
అర్హత: మొదటి ప్రయత్నంలోనే పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: 31.12.2022 నాటికి 18 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక: పదో తరగతిలో సాధించిన మెరిట్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ), రిజర్వేషన్స్ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్లైన్/ ఆఫ్‌లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 15.
దరఖాస్తు హార్డ్‌కాపీల స్వీకరణకు చివరి తేదీ: 2022, జులై 19.
ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల తేదీ: 2022, జులై 30.
చిరునామా: కన్వీనర్, యూజీ అడ్మిషన్స్ 2022-23, ఆర్జీయూకేటీ, బాసర, నిర్మల్ జిల్లా, తెలంగాణ-504107.
వెబ్సైట్: https://www.rgukt.ac.in/
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో...
హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దూరవిద్యా విశ్వవిద్యాలయం (బీఆర్ఏఓయూ) 2022-23 విద్యాసంవత్సరానికి వివిధ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
* యూజీ/ పీజీ/ పీజీ డిప్లొమా/ సర్టిఫికెట్ ప్రోగ్రాములు
1) అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ): బీఏ, బీకాం, బీఎస్సీ
అర్హత: ఇంటర్మీడియట్ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత.
2) పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ): ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఎల్ఐఎస్సీ, బీఎల్ఐఎస్సీ.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత.
3) పీజీ డిప్లొమా ప్రోగ్రాములు: పీజీడీఎంఎం, పీజీడీబీఎఫ్, పీజీడీఈఎస్, పీజీడీహెచ్ఆర్ తదితరాలు.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత.
4) సర్టిఫికెట్ ప్రోగ్రాములు: సీపీఎఫ్ఎన్, సీపీఎల్సీడీ, సీపీఈసీఈ తదితరాలు.
అర్హత: పదో తరగతి/ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 31.
వెబ్సైట్: https://www.braouonline.in/
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్‌రెడ్డి
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
-
ఇంటినే చక్కదిద్దలేరు.. ఇక రాష్ట్రాన్ని ఎలా?: అనురాగ్ ఠాకూర్
-
బందరుకు ఏం చేశారో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా?: చంద్రబాబు
-
గుజరాత్‌ను వణికించిన దిల్లీ
-
దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమే: రాజ్‌నాథ్ సింగ్