Published : 17 Jul 2018 01:27 IST

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
గోవా నేవల్‌ ఏరియా  

వాస్కోడగామా (గోవా) నేవల్‌ ఏరియా హెడ్‌ క్వార్టర్స్‌లో గ్రూప్‌ ‘సి’ సివిలియన్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. పోస్టులు: టెలిఫోన్‌ ఆపరేటర్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ తదితరాలు.
ఖాళీలు: 76 (వీటిలో 42 పోస్టులను గతంలో నేవల్‌ అప్రెంటిస్‌షిప్‌ పూర్తి చేసిన అభ్యర్థులకు కేటాయించారు).
అర్హత: పదోతరగతి, ఐటీఐ/ అప్రెంటిస్‌ సర్టిఫికెట్‌, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌.
ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌/ ప్రాక్టికల్‌ టెస్ట్‌, ఫిజికల్‌/ట్రేడ్‌ టెస్ట్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (14-20 జులై 2018)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి నాలుగో రోజున ప్రారంభం.
చివరి తేది: దరఖాస్తు ప్రారంభమైన తేదీ నుంచి 22 రోజుల వరకు.
వెబ్‌సైట్‌: http://hqgnanavyciviliansrect.com/

ఎన్‌జీఆర్‌ఐలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌  

సంస్థ: సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ జియోఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ), హైదరాబాద్‌.
పోస్టులు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, రిసెర్చ్‌ అసోసియేట్‌ తదితర ప్రాజెక్ట్‌ స్టాఫ్‌.
ఖాళీలు: 58 అర్హత: సంబంధిత సబ్జెక్టులు/ బ్రాంచుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, ఎంసీఏ, ఎంటెక్‌, బీఈ/ బీటెక్‌, డిప్లొమా, పీహెచ్‌డీ, అనుభవం. ఎంపిక: ఇంటర్వ్యూ  ఆధారంగా.
ఇంటర్వ్యూ తేది: 2018 ఆగస్టు 9, 10.
దరఖాస్తు: ఆన్‌లైన్‌. చివరి తేది: 24.07.2018
వెబ్‌సైట్‌: http://www.ngri.org.in/

శాయ్‌, న్యూదిల్లీలో జూనియర్‌ అకౌంటెంట్లు

సంస్థ: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (శాయ్‌), న్యూదిల్లీ.
పోస్టు: జూనియర్‌ అకౌంటెంట్‌ (ఒప్పంద ప్రాతిపదికన)
ఖాళీలు: 30
అర్హత: కామర్స్‌/ అకౌంట్స్‌లో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి. ఎంకాం/ఎంబీఏ ఉన్నవారికి ప్రాధాన్యం. ఎంపిక: సంస్థ నిబంధనల ప్రకారం.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌.చివరి తేది: 01.08.2018
వెబ్‌సైట్‌: http://sportsauthorityofindia.nic.in/

డబ్ల్యూఐఐ, దేహ్రాదూన్‌  

సంస్థ: వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఐఐ), దేహ్రాదూన్‌ (ఉత్తరాఖండ్‌). పోస్టులు: ప్రాజెక్ట్‌ పర్సనల్‌ (ఒప్పంద ప్రాతిపదికన)
ఖాళీలు: 24 పోస్టులు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, స్పేషియల్‌ అనలిస్ట్‌, ప్రాజెక్ట్‌ ఫెలో, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌, జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ, అనుభవం.
ఎంపిక: ఆన్‌లైన్‌ రాతపరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రాసెసింగ్‌ ఫీజు: రూ.800.
ఆన్‌లైన్‌ దరఖాస్తు: 17.07.2018 నుంచి 16.08.2018 వరకు.
వెబ్‌సైట్‌: http://www.wii.gov.in/

ప్రవేశాలు

కాఫీ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా
బెంగళూరులోని కాఫీ బోర్డు 2018-19 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమాలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్‌ కాఫీ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కాల వ్యవధి: 12 నెలలు.
కోర్సు ఫీజు: రూ.2,50,000. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక: అకడమిక్‌ ప్రతిభ, పర్సనల్‌ ఇంటర్వ్యూ, సెన్సరీ ఎవల్యూషన్‌ టెస్ట్‌ ఆధారంగా. ఇంటర్వ్యూ తేది: 21.08.2018 దరఖాస్తు: ఆఫ్‌లైన్‌.  దరఖాస్తు ఫీజు: రూ.1500
చివరి తేది: 14.08.2018 వెబ్‌సైట్‌: https://www.indiacoffee.org/

విద్యుత్‌ సరఫరా, పంపిణీలో పీజీ డిప్లొమా

న్యూదిల్లీలోని నేషనల్‌ పవర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌పీటీఐ) 2018-19 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌. సీట్ల సంఖ్య: 60 అర్హత: ఎలక్ట్రికల్‌్/పవర్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత. ఎంపిక: అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా. దరఖాస్తు: ఆఫ్‌లైన్‌. దరఖాస్తు ఫీజు: రూ.500.
చివరి తేది: 10.08.2018

వెబ్‌సైట్‌: http://npti.gov.in/

యోగా సైన్సులో డిప్లొమా కోర్సులు

సంస్థ: మొరార్జీ దేశాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యోగా, న్యూదిల్లీ
కోర్సు: డిప్లొమా ఇన్‌ యోగా సైన్స్‌ (డీవైఎస్సీ).
కాల వ్యవధి: ఒక ఏడాది. సీట్ల సంఖ్య: 120 ఫెలోషిప్‌‌: నెల‌కు రూ.8,000. అర్హత:  కనీసం 50శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. వయసు: 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: అకడమిక్‌ ప్రతిభ, మెడికల్‌ ఫిట్‌నెస్‌ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌. దరఖాస్తు ఫీజు: రూ.500.
చివరి తేది: 04.08.2018 వెబ్‌సైట్‌: http://www.yogamdniy.nic.in/

వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ
సంస్థ: ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ), పుణె.
పోస్టులు: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ తదితర ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ (తాత్కాలికం).
ఖాళీలు: 14
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్‌, డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌, ఎండీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
ఇంటర్వ్యూ తేది: 2018 జులై 25,  26, 27.
వేదిక: ఎన్‌ఐవీ గోరఖ్‌పూర్‌ యూనిట్‌, డిపార్ట్‌మెంట్‌ ఆప్‌ ఆంకాలజీ (క్యాన్సర్‌ భవన్‌) ఎదురుగా, బీఆర్‌డీ మెడికల్‌ కాలేజ్‌ క్యాంపస్‌, గోరఖ్‌పూర్‌, యూపీ. వెబ్‌సైట్‌: http://www.niv.co.in/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net  చూడవచ్చు




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు