Published : 18 Jul 2018 01:36 IST
నోటీస్ బోర్డు
నోటీస్ బోర్డు
ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(మనూ) ప్రధాన క్యాంపస్, శాటిలైట్ క్యాంపస్‌లు, ఆఫీసుల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు. 1. టీచింగ్ పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ 2. అకడమిక్ పోస్టులు: ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ 3. నాన్-టీచింగ్ పోస్టులు: సిస్టమ్ అనలిస్ట్, సెక్షన్ ఆఫీసర్, ఇన్స్ట్రక్టర్, ఎల్డీసీ, అటెండెంట్ తదితరాలు. ఖాళీలు: 85 అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, 10+2, ఎన్ఏ/ ఎన్టీ సర్టిఫికెట్, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, నెట్ తదితరాల్లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక: పోస్టును బట్టి రాత, నైపుణ్య పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆఫ్‌లైన్ దరఖాస్తు చివరితేది: 20.08.2018. వెబ్సైట్: www.manuu.ac.in |
కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఎగిక్యూటివ్ ట్రెయినీల భర్తీకి దరఖాస్తులు. విభాగాలు: మెకానికల్, ఎల్రక్టికల్, సివిల్, ఎల్రక్టానిక్స్, సేఫ్టీ, ఐటీ, ఫైనాన్స్, హెచ్ఆర్. ఖాళీలు: 35 అర్హత: ఇంజినీరింగ్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ, డిప్లొమా ఉత్తీర్ణత. వయసు: 27 ఏళ్లు మించకూడదు. ఎంపిక: ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ: 18.07.2018 నుంచి 20.08.2018. వెబ్సైట్: www.cochinshipyard.com |
ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు. పోస్టు-ఖాళీలు: ఆఫీసర్ (హెచ్ఆర్ ఖీ ఐఆర్/ అకౌంట్స్)- 15. అర్హత: ఇంటర్ సీఏ/ సీఎంఏ, ఎంబీఏ, ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానంతోపాటు మూడేళ్ల పని అనుభవం ఉండాలి. ఎంపిక: గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా. ఈమెయిల్ దరఖాస్తు చివరితేది: 03.08.2018 ఈమెయిల్: rftc.aiatsl@airindia.in వెబ్సైట్: www.airindia.in |
గురుగ్రామ్(హరియాణా)లోని వాప్కోస్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ఎక్స్పర్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీలు: 31. విభాగాలు: ఎల్రక్టికల్, సివిల్, సోలార్, మెకానికల్. అర్హత: బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి. ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆఫ్‌లైన్ దరఖాస్తు చివరితేది: 26.07.2018. వెబ్సైట్: www.wapcos.gov.in |
తెలంగాణ వికలాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని స్టేట్ రిసోర్స్ సెంటర్లో తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు. పోస్టు-ఖాళీలు: ప్లేస్మెంట్ ఆపరేటర్- 01, ప్లేస్మెంట్ కోఆర్డినేటర్- 01. అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానంతోపాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి. ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆఫ్‌లైన్ దరఖాస్తు చివరితేది: దిన పత్రికలో ఈ ప్రకటన వెలువడినతేదీ (17.07.2018) నుంచి 7 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్: www.wdsc.telangana.gov.in |
అప్రెంటిస్‌షిప్ |
ముంబయిలోని మజ్గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. ట్రేడు-ఖాళీలు: ఎల్రక్టీషియన్- 39, ఫిట్టర్- 61, పైప్ ఫిట్టర్- 44, స్ట్రక్చరల్ ఫిట్టర్- 30, ఐసీటీఎస్ఎం- 15, ఎలక్ట్రానిక్ మెకానిక్- 29, కార్పెంటర్- 30, స్ట్రక్చరల్ ఫిట్టర్(ఎక్స్ ఐటీఐ ఫిట్టర్)- 52, రిగ్గర్- 48, వెల్డర్- 34. అర్హత: ఎనిమిది, పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేది: 03.08.2018. వెబ్సైట్: http://mazagondock.in/ |
యెలహంక(బెంగళూరు)లోని రైల్ వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ ఖాళీలకు దరఖాస్తులు. ట్రేడులు: ఫిట్టర్, మెషినిస్ట్, మెకానిక్, టర్నర్, సీఎన్సీ, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్. ఖాళీలు: 192. అర్హత: పదో తరగతి, నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉత్తీర్ణత. వయసు: 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఆఫ్‌లైన్ దరఖాస్తు చివరి తేది: 13.08.2018. వెబ్సైట్: www.rwf.indianrailways.gov.in |
ప్రవేశాలు |
గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎల్రక్టానిక్స్ సికింద్రాబాద్‌లోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్‌లో కమ్యూనిటీ కాలేజ్ స్కీమ్ కింద వీడియోగ్రఫీ, ఎడిటింగ్ (లెవెల్-3, లెవెల్-4) సర్టిఫికెట్ కోర్సు ప్రవేశాలు. కోర్సు వ్యవధి: 6 నెలలు. అర్హత: సంబంధిత ట్రేడ్/ బ్రాంచుల్లో ఎస్ఎస్సీ/ ఐటీఐ/ ఐవీసీ, లెవెల్-3 సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణత. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్. దరఖాస్తులను సంస్థ కార్యాలయం నుంచి నేరుగా పొందవచ్చు. చిరునామా: ప్రిన్సిపల్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎల్రక్టానిక్స్, ఈస్ట్ మారేడుపల్లి, నెహ్రూ నగర, సికింద్రాబాద్. |
దరఖాస్తు చివరితేది: 28.07.2018.మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు |
Tags :
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Nellore: కోటంరెడ్డిని తప్పించి.. నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డికి బాధ్యతలు
-
Movies News
Chiranjeevi: ఉదారత చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఏకంగా రూ.5 లక్షలు ఆర్థికసాయం
-
General News
ED: మద్యం కుంభకోణం మనీలాండరింగ్ కేసు.. ఈడీ ఛార్జిషీట్లో కేజ్రీవాల్, కవిత పేర్లు
-
Crime News
కారు ప్రమాదం.. కళ్లముందే నిండు గర్భిణీ, భర్త సజీవదహనం
-
World News
Mossad: ఇరాన్ క్షిపణి స్థావరంపై మొస్సాద్ సీక్రెట్ ఆపరేషన్..!