ప్రభుత్వ ఉద్యోగాలు

అటామిక్‌ ఎనర్జీ ఎడ్యుకేషన్‌ సొసైటీ భారత అణుశక్తి విభాగానికి చెందిన అటామిక్‌ ఎనర్జీ ఎడ్యుకేషన్‌ సొసైటీ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.....

Published : 23 Jul 2018 01:39 IST

నోటీస్‌బోర్డు
ప్రభుత్వ ఉద్యోగాలు

అటామిక్‌ ఎనర్జీ ఎడ్యుకేషన్‌ సొసైటీ
భారత అణుశక్తి విభాగానికి చెందిన అటామిక్‌ ఎనర్జీ ఎడ్యుకేషన్‌ సొసైటీ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: టీజీటీ, ప్రైమరీ టీచర్‌ తదితర టీచింగ్‌ పోస్టులు.ఖాళీలు: 50 అర్హత, వయసు: సొసైటీ నిబంధనల ప్రకారం. ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ద్వారా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ దరఖాస్తు ఫీజు: రూ. 750
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 10.08.2018 హార్డు కాపీలను పంపడానికి చివరి తేది: 20.08.2018 
వెబ్‌సైట్‌:  https://aees.mahaonline.gov.in/
ఇండియన్‌ ఆర్మీ- జేఏజీ ఎంట్రీ స్కీమ్‌ 
ఇండియన్‌ ఆర్మీ... జడ్జి అడ్వకేట్‌ జనరల్‌ (జేఏజీ) బ్రాంచు ఉద్యోగాలకు అవివాహిత లా గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పురుషులతోపాటు మహిళలూ వీటికి అర్హులే.
పోస్టు: జడ్జి అడ్వకేట్‌ జనరల్‌ (జేఈజీ) ఖాళీలు: 14 (పురుషులు-07, మహిళలు-07)
శిక్షణ కాలం: 49 వారాలు. ఎంపికైన అభ్యర్థులకు చెన్నైలోని  ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో శిక్షణ ఇస్తారు.
అర్హత: కనీసం 55శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ డిగ్రీ ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 01.01.2019 నాటికి 21-27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌. చివరి తేది: 16.08.2018
వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/
అప్రెంటిస్‌షిప్‌
రాజా రామన్న సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ
సంస్థ: రాజా రామన్న సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ, ఇండోర్‌ (మధ్యప్రదేశ్‌). 
పోస్టు: ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీలు: 50 స్టైపెండ్‌: నెలకు రూ.7200
అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 15.01.2018 నాటికి 18-22 ఏళ్ల మధ్య ఉండాలి. 
ఎంపిక: పదో తరగతి, ఐటీఐలో ప్రతిభ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్‌. చివరి తేది: 10.08.2018. 
వెబ్‌సైట్‌:  http://www.rrcat.gov.in
వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ
ఆర్‌ఎంఆర్‌సీ, దిబ్రూగఢ్‌ 
సంస్థ: ఐసీఎంఆర్‌- రీజనల్‌ మెడికల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (ఆర్‌ఎంఆర్‌సీ), దిబ్రూగఢ్‌. 
పోస్టులు: ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌ తదితరాలు (కాంట్రాక్టు). ఖాళీలు: 36
అర్హత: పదోతరగతి, ఇంటర్‌, ఎంబీబీఎస్‌, డిగ్రీ, పీజీ/ డిప్లొమా, ఇంగ్లిష్‌ టైపింగ్‌, అనుభవం. ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేది: 2018 జులై 30, 31.
వేదిక: ఐసీఎంఆర్‌-రీజనల్‌ మెడికల్‌ రిసెర్చ్‌ సెంటర్‌, నార్త్‌ ఈస్ట్‌ రీజియన్‌, దిబ్రూగఢ్‌, అసోం.
వెబ్‌సైట్‌:  http://rmrcne.org.in/
మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని