ప్రభుత్వ ఉద్యోగాలు

హెపీసీఎల్‌లో ఖాళీలు ముంబయిలోని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌.. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన కింది పోస్టులు భర్తీ చేయనుంది. పోస్టులు: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, రిసెర్చ్‌ అసోసియేట్‌....

Published : 25 Jul 2018 01:32 IST

నోటీస్‌బోర్డు
ప్రభుత్వ ఉద్యోగాలు

హెపీసీఎల్‌లో ఖాళీలు
ముంబయిలోని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌.. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన కింది పోస్టులు భర్తీ చేయనుంది.
పోస్టులు: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, రిసెర్చ్‌ అసోసియేట్‌.
అర్హత: సంబంధిత విభాగంలో 60% మార్కులతో డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: పీఏ పోస్టులకు 28 ఏళ్లు, ఆర్‌ఏ ఖాళీలకు 32 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేది: 31.08.2018.
వెబ్‌సైట్‌: http://hindustanpetroleum.com

ఆర్‌జీయూకేటీ, బాసర
బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సబ్జెక్టులు: కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, తెలుగు. 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో  55శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ, నెట్‌/ స్లెట్‌/ సెట్‌ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణత. 
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. 
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 29.07.2018. 
వెబ్‌సైట్‌: ‌www.rgukt.ac.in
తెలంగాణ డబ్ల్యూడీఎస్‌సీలో కన్సల్టెంట్లు
తెలంగాణలోని వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు-ఖాళీలు: డిసేబిలిటీ రీహాబిలిటేషన్‌ కన్సల్టెంట్‌- 01, లీగల్‌ కన్సల్టెంట్‌- 01, అడ్మినిస్ట్రేటివ్‌ కన్సల్టెంట్‌- 01, స్టేట్‌ కో-ఆర్డినేటర్‌- 01.
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ, కంప్యూటర్‌ పరిజ్ఞానం, ఇంగ్లిష్‌, తెలుగు, హిందీ భాషల్లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, పని అనుభవం ఉండాలి. 
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 16.08.2018.
వెబ్‌సైట‌: www.wdsc.telangana.gov.in
స్కాలర్‌షిప్‌
దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ యోజన 
తెలంగాణ పోస్టల్‌ సర్కిల్‌.. దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ యోజన పథకం కింద ఉపకారవేతనం కోసం దరఖాస్తులు కోరుతోంది. తపాలా బిళ్లల సేకరణ, అధ్యయనం (ఫిలాటెలీ) పట్ల విద్యార్థులకు ఆసక్తి కలిగించేందుకు భారతీయ తపాలా శాఖ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది.
అర్హత: ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. విద్యార్థులు తమ పాఠశాలల ఫిలాటెలీ క్లబ్బులో సభ్యులై ఉండాలి.
ఎంపిక: ఫిలాటెలీ క్విజ్‌/ ప్రాజెక్ట్‌ ఆధారంగా. వీటిని తెలంగాణ పోస్టల్‌ సర్కిల్‌ నిర్వహించనుంది.
స్కాలర్‌షిప్‌: ఏడాదికి రూ.6,000.
దరఖాస్తు: వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న దరఖాస్తులను విద్యార్థులు తమ దగ్గరిలోని పోస్ట్‌ ఆఫీసు సూపరింటెండెంట్‌ కార్యాలయంలో అందజేయాలి.
చివరితేది: 25.08.2018.
వెబ్‌సైట్‌: ‌www.telanganapostalcircle.in
మరిన్ని నోటిఫికేషన్ల కోసం ‌www.eenadupratibha.net చూడవచ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని