ప్రభుత్వ ఉద్యోగాలు

ఐవోసీఎల్‌, పారాదీప్‌ రిఫైనరీ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు చెందిన పారాదీస్‌ రిఫైనరీ(ఒడిశా)లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీ.....

Published : 01 Aug 2018 06:05 IST

నోటీస్‌బోర్డు
ప్రభుత్వ ఉద్యోగాలు

ఐవోసీఎల్‌, పారాదీప్‌ రిఫైనరీ
ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు చెందిన పారాదీస్‌ రిఫైనరీ(ఒడిశా)లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీ.
పోస్టు-ఖాళీలు: జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌-4/ జేటీఏ(ప్రొడక్షన్‌/ పీఖీయూ, ఓఖీఎం/ మెకానికల్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌)- 40 
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌/ ప్రొఫిషియన్సీ/ ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 21.08.2018. 
వెబ్‌సైట్‌: ‌www.iocl.com
దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా వర్సిటీ
విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీలో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు. 
పోస్టు-ఖాళీలు: ప్రొఫెసర్‌(లా)- 02, అసోసియేట్‌ ప్రొఫెసర్‌(లా)- 02, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(లా)- 02, రిజిస్ట్రార్‌- 01. 
అర్హత: ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ, నెట్‌/ స్లెట్‌/ సెట్‌ ఉత్తీర్ణతతోపాటు బోధన/ పరిశోధనానుభవం ఉండాలి. 
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా. 
ఆఫ్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 20.08.2018.
వెబ్‌సైట్‌:  https://dsnlu.ac.in/
ఇండియన్‌ బ్యాంకులో 417 పీవోలు
ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఇండియన్‌ బ్యాంకు దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు ఏడాది వ్యవధితో ఇండియన్‌ బ్యాంకు- 
మణిపాల్‌ స్కూల్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది.
పోస్టు-ఖాళీలు: ప్రొబేషనరీ ఆఫీసర్‌- 417. 
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. వయసు: 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ప్రాథమిక, ప్రధాన పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.600  ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 27.08.2018.  ప్రిలిమినరీ పరీక్ష తేది: 06.10.2018.
మెయిన్‌ పరీక్ష తేది: 04.11.2018. www.indianbank.in
వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ
కాలికట్‌ నిట్‌లో ఖాళీలు 
కాలికట్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టులకు దరఖాస్తులు.
పోస్టు-ఖాళీలు: జూనియర్‌ ఇంజినీర్‌(సివిల్‌)- 08, ప్రాజెక్ట్‌ నెట్‌వర్క్‌/ జూనియర్‌ నెట్‌వర్క్‌/ హార్డ్‌వేర్‌ టెక్నీషియన్‌- 04, టెక్నికల్‌ అసిస్టెంట్‌- 19. 
ఇంటర్వ్యూ తేదీలు: జేఈ పోస్టులకు ఆగస్టు 8, మిగిలిన వాటికి ఆగస్టు 14.
వేదిక: నిట్‌, కాలికట్‌. www.nitc.ac.in
ప్రవేశాలు
బాసర ఆర్‌జీయూకేటీలో ఎంటెక్‌ ప్రోగ్రాములు
బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌- ఎంటెక్‌ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: కంప్యుటేషనల్‌ ఇంజినీరింగ్‌ (కంప్యూటర్‌ సైన్స్‌ & ఇంజినీరింగ్‌, ఎల‌్రక్టానిక్స్‌ & కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌), కంప్యుటేషనల్‌ మెకానిక్స్‌ (మెకానికల్‌ ఇంజినీరింగ్‌).
సీట్ల సంఖ్య: 66
అర్హత: బీఈ/బీటెక్‌ (ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్‌)తోపాటు 2016, 2017, 2018లో గేట్‌ లేదా పీజీఈసెట్‌-2018 ఉత్తీర్ణత.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 14.08.2018.
వెబ్‌సైట్‌: www.rgukt.ac.in
మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని