Published : 07 Aug 2018 01:28 IST
అర్హత పరీక్ష
నోటీస్‌బోర్డు
అర్హత పరీక్ష
గేట్-2019
ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఎస్‌సీ, కేంద్ర ఆర్థిక సహకార విద్యాసంస్థల్లో ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశానికి, కేంద్ర రంగ సంస్థల్లో ఉద్యోగ ముఖాముఖీ అర్హతకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్టు ఇన్ ఇంజినీరింగ్(గేట్)-2019 నోటిఫికేషన్ విడుదలైంది. ఐఐటీ మద్రాస్ ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యత చేపట్టింది. మొత్తం 24 సబ్జెక్టుల్లో పరీక్ష ఉంటుంది. అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్/ మాస్టర్ డిగ్రీ/ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ/ డ్యూయల్ డిగ్రీ ఉత్తీర్ణత. దరఖాస్తు ఫీజు: రూ.1500. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ: సెప్టెంబరు 1 నుంచి 21 వరకు. ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: 2019, ఫిబ్రవరి 2, 3, 9, 10. ఫలితాల వెల్లడి: 2019, మార్చి 16. వెబ్‌సైట్: http://gate.iitm.ac.in/
|
ప్రభుత్వ ఉద్యోగాలు టీఎస్ డెయిరీ డెవలప్‌మెంట్‌లో ఖాళీలు
తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్‌లో పలు ఉద్యోగాల భర్తీ కోసం టీఎస్‌పీఎస్సీ దరఖాస్తులు కోరుతోంది. పోస్టు-ఖాళీలు: అసిస్టెంట్ డెయిరీ మేనేజర్/ మేనేజర్ ఖీ ఏక్యూసీ- 06, ప్రాసెసింగ్ ఖీ ఫీల్డ్ సూపర్‌వైజర్- 16, ల్యాబ్ అసిస్టెంట్- 10, బాయిలర్ ఆపరేటర్- 03, ప్లాంట్ ఆపరేటర్- 25, మార్కెటింగ్ అసిస్టెంట్- 10, సూపర్‌వైజర్(మార్కెటింగ్)- 12. మొత్తం ఖాళీలు- 82. * అర్హత, వయసు, ఎంపిక విధానం తదితర వివరాలకు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ చూడవచ్చు. వెబ్‌సైట్:https://tspsc.gov.in/
|
బీఎంఆర్‌సీఎల్‌లో ఇంజినీర్లు
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(బీఎంఆర్‌సీఎల్)- ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. పోస్టు-ఖాళీలు: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్- 31, అసిస్టెంట్ ఇంజినీర్- 68, చీఫ్ ఇంజినీర్/ అడ్వైజర్- 08. మొత్తం పోస్టులు- 107. అర్హత: బీఈ/ బీటెక్(సివిల్), డిప్లొమా(సివిల్) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్. హార్డుకాపీలు పంపేందుకు చివరితేది: ఏఈఈ, ఏఈ పోస్టులకు 31.08.2018, సీఈ ఖాళీలకు 05.09.2018. వెబ్‌సైట్:http://english.bmrc.co.in
|
రైట్స్ లిమిటెడ్‌లో డీజీఎం పోస్టులు
గుడ్‌గావ్‌లోని రైట్స్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టు-ఖాళీలు: డిప్యూటీ జనరల్ మేనేజర్- 10, డిప్యూటీ జనరల్ మేనేజర్(ఎంఈపీ ఎక్స్‌పర్ట్)- 08, సైట్ ఇంజినీర్- 12. అర్హత: మొదటి శ్రేణిలో ఇంజినీరింగ్ డిగ్రీ(సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి. వయసు: 54 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తు చివరితేది: 23.08.2018. హార్డుకాపీలు పంపేందుకు చివరితేది: 30.08.2018. వెబ్‌సైట్:http://rites.com/
|
ఆర్‌బీఐలో మెడికల్ కన్సల్టెంట్లు
ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టు-ఖాళీలు: మెడికల్ కన్సల్టెంట్- 10. అర్హత: ఎంబీబీఎస్, పీజీ(జనరల్ మెడిసిన్) ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆఫ్‌లైన్ దరఖాస్తు చివరితేది: 20.08.2018. వెబ్‌సైట్: www.rbi.org.in
|
మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు |
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.