టీసీఎస్ ఉద్యోగాహ్వానం!
టీసీఎస్ ఉద్యోగాహ్వానం!
2019లో కోర్సు పూర్తిచేసుకోబోయే ఇంజినీరింగ్ విద్యార్థ్థులకు ప్రసిద్ధ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) ఒక శుభవార్తను ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని టెక్నికల్ విభాగాల్లో వీరికి ఉద్యోగావకాశాలను అందించనుంది. క్వాలిఫయర్ పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా తగిన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటుంది! టీసీఎస్ దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్ల నుంచి నింజా డెవలపర్లను ఎంచుకోనుంది. బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ ఎంసీఏ- 2019లో రెగ్యులర్ విధానంలో పూర్తయ్యేవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంజినీరింగ్ అన్ని స్పెషలైజేషన్లవారూ, ఎంఎస్‌సీ కంప్యూటర్‌సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇతర సంబంధిత విభాగాలవారూ, డిగ్రీలో బీఎస్‌సీ/ బీసీఏ/ బీకాం/ బీఏల్లో మేథమేటిక్స్/ స్టాటిస్టిక్స్ చదివి, ఆపై ఎంసీఏ చేసినవారూ అర్హులు. పది, ఇంటర్మీడియట్, డిగ్రీ/ డిప్లొమా, పీజీల్లో 60% మార్కులు తప్పనిసరిగా కలిగివుండాలి. పరీక్ష రాసేనాటికి బ్యాక్‌లాగ్ ఒకటికి మించి ఉండకూడదు. విద్యాపరంగా రెండేళ్లకు మించి విరామం ఉండకూడదు.ఎంపిక ఎలా?
నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి- 90 నిమిషాలు. ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, కోడింగ్ అంశాలపై ప్రశ్నలుంటాయి. ఇందులో ఉత్తీర్ణులైనవారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దానిలో విజయం సాధించినవారికి టీసీఎస్ ఉద్యోగ ఆఫర్ లభిస్తుంది.
దరఖాస్తు విధానం
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్థులు ముందుగా.. http://www.careers.tcs.comలో బిగినర్స్ ట్యాబ్ కింద ఉన్న ‘న్యూ యూజర్’ను ఎంచుకోవాలి. దానిలో ఐటీని క్లిక్ చేసి, దరఖాస్తు ఫారాన్ని పూర్తిచేయాలి. ‘అప్లికేషన్ రిసీవ్‌డ్’ అని వచ్చాక ‘అప్లై ఫర్ డ్రైవ్’ మీద క్లిక్ చేసి ప్రక్రియను పూర్తిచేయాలి.
దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 20, 2018
పరీక్ష తేదీలు: 2018 సెప్టెంబరు 2, 3 తేదీలు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Nara Lokesh: వడ్డెర సామాజిక వర్గానికి రాజకీయంగా అవకాశాలిస్తాం: నారా లోకేశ్
-
India News
SC: బీబీసీ డాక్యుమెంటరీ వివాదం.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
-
India News
Congress: చైనా విషయంలో కేంద్రానిది DDLJ వ్యూహం: కాంగ్రెస్ కౌంటర్
-
India News
Rahul Gandhi: మంచులో రాహుల్-ప్రియాంక ఫైట్.. వీడియో వైరల్
-
Movies News
Jayasudha: ఆ భయంతోనే అజిత్ సినిమాలో నటించలేదు: జయసుధ
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు