Published : 28 Aug 2018 01:35 IST

నోటీస్ బోర్డు

నోటీస్ బోర్డు

అప్రెంటిస్‌షిప్‌
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌  

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ అప్రెంటిస్‌ శిక్షణకు ఐటీఐ, డిప్లొమా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: ఐటీఐ, డిప్లొమా అప్రెంటిస్‌
కాలవ్యవధి: ఒక ఏడాది
అర్హత: సంబంధిత ట్రేడులు/ బ్రాంచుల్లో ఐటీఐ/ ఐటీసీ, డిప్లొమా ఉత్తీర్ణత.
ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌
చివరి తేది: ఐటీఐ అభ్యర్థులకు సెప్టెంబరు 6, డిప్లొమా అభ్యర్థులకు సెప్టెంబరు 10.
వెబ్‌సైట్‌:https://hal-india.co.in/

ప్రభుత్వ ఉద్యోగాలు
ఎన్‌ఐఈపీఎండీ, చెన్నై

సంస్థ: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ మల్టిపుల్‌ డిజెబిలిటీస్‌ (ఎన్‌ఐఈపీఎండీ), చెన్నై.
పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, లెక్చరర్‌, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌, అకౌంటెంట్‌ తదితరాలు (కాంట్రాక్టు).
ఖాళీలు: 19
వర్క్‌ లొకేషన్‌: కాంపోజిట్‌ రీజనల్‌ సెంటర్‌ ఫర్‌ పర్సన్స్‌ విత్‌ డిజెబిలిటీస్‌, గోరఖ్‌పూర్‌.
అర్హత: ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంఫిల్‌, ఎంబీబీఎస్‌, అనుభవం.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌.
దరఖాస్తు ఫీజు: రూ.500.
చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (2018 ఆగస్టు 25-31)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు.
వెబ్‌సైట్‌:http://www.niepmd.tn.nic.in/

ప్రవేశాలు
రైల్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో డిప్లొమా  

న్యూదిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రైల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వివిధ డిప్లొమా ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సులు: 1) మల్టీమోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (కంటైనెరైజేషన్‌) అండ్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌
2) రైల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌
కాలవ్యవధి: ఒక ఏడాది.
అర్హత: ఏదైనా డిగ్రీ లేదా మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
ఎంపిక: రాతపరీక్ష ఆధారంగా.
పరీక్ష కేంద్రాలు: దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, సికింద్రాబాద్‌, లఖ్‌నవూ, గువాహటి, భువనేశ్వర్‌.
దరఖాస్తు: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.
చివరి తేది: సెప్టెంబరు 28
వెబ్‌సైట్‌:http://irt.indianrailways.gov.in

నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ  

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ 2018-19 విద్యా సంవత్సరానికి దూరవిద్య విధానంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సులు: రెండేళ్ల పీజీ, మూడేళ్ల యూజీ, ఏడాది డిప్లొమా, 6 నెలల సర్టిఫికెట్‌ కోర్సులు.
అర్హత, ఎంపిక: వర్సిటీ నిబంధనల ప్రకారం.
దరఖాస్తు: ఆన్‌లైన్‌.
రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.200.
ఆన్‌లైన్‌ దరఖాస్తు: ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 30 వరకు.
వెబ్‌సైట్‌:http://manuu.ac.in/

ఫెలోషిప్స్‌
ఎఫ్‌ఐటీఎం - ఆయుష్‌ ఫెలోషిప్‌

న్యూదిల్లీలోని భారత ప్రభుత్వ ఆయుష్‌ మంత్రిత్వ శాఖకు చెందిన ది ఫోరం ఆన్‌ ఇండియన్‌ ట్రెడిషినల్‌ మెడిసిన్‌ (ఎఫ్‌ఐటీఎం) ఫెలోషిప్‌లకు దరఖాస్తులు కోరుతోంది.
1) డాక్టొరల్‌ ఫెలోషిప్‌ (రెండేళ్లు)
2) పోస్ట్‌ డాక్టొరల్‌ ఫెలోషిప్‌ (ఏడాది)
అర్హత: ఆయుష్‌ విభాగాల్లో విద్యార్హత ఉండి, ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నవారు, పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
వయసు: డాక్టొరల్‌ ఫెలోషిప్‌ ఖాళీలకు 28 ఏళ్లు, పోస్ట్‌ డాక్టొరల్‌ ఫెలోషిప్‌ ఖాళీలకు 35 ఏళ్లు మించకూడదు.
ఫెలోషిప్‌: డాక్టొరల్‌ ఫెలోషిప్‌ ఏడాదికి రూ.5 లక్షలు, పోస్ట్‌ డాక్టొరల్‌ ఫెలోషిప్‌ ఏడాదికి రూ.7.5 లక్షలు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌.
చివరి తేది: సెప్టెంబరు 15
వెబ్‌సైట్‌:http://www.fitm.ris.org.in/fellowship

వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ
వైద్య కళాశాలలో టీచింగ్‌ పోస్టులు

నిజామాబాద్‌లోని గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీ- ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టులు: ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.
ఖాళీలు: 32 అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషాలిటీలో పీజీ (ఎండీ/ ఎంఎస్‌), బోధనానుభవం.
ఇంటర్వ్యూ తేది: ఆగస్టు 31
వేదిక: జాయింట్‌ కలెక్టర్‌ చాంబర్‌, నిజామాబాద్‌.
వెబ్‌సైట్‌:http://www. gmcnzb.org/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం  www.eenadupratibha.net  చూడవచ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని