నోటీస్ బోర్డు

నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌(నాబార్డు) దేశ వ్యాప్తంగా ఉన్న సంబంధిత కార్యాలయాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది....

Published : 29 Aug 2018 01:56 IST

 నోటీస్ బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
 

నాబార్డులో డెవలప్‌మెంట్‌ అసిస్టెంట్లు  

నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌(నాబార్డు) దేశ వ్యాప్తంగా ఉన్న సంబంధిత కార్యాలయాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు-ఖాళీలు: డెవలప్‌మెంట్‌ అసిస్టెంట్‌- 62, అసిస్టెంట్‌ మేనేజర్‌- 07.
అర్హత: డీఏ పోస్టులకు 50% మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ఏఎం ఖాళీలకు నిర్దేశిత విద్యార్హతతోపాటు ఆర్మీ/ నేవీ/ ఎయిర్‌ఫోర్స్‌ కమిషన్డ్‌ సర్వీస్‌లో ఆఫీసర్‌గా కనీసం అయిదేళ్ల పని అనుభవం ఉండాలి.
ఎంపిక: డీఏ పోస్టులకు ప్రాథమిక, ప్రధాన పరీక్షలు, ఏఎం ఖాళీలకు ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 12.09.2018. వెబ్‌సైట్‌: ‌www.nabard.org

హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌

విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఖాళీల భర్తీ.
పోస్టు-ఖాళీలు: అసిస్టెంట్‌ మేనేజర్‌(ఫైనాన్స్‌/ హెచ్‌ఆర్‌)- 06.
అర్హత: ఏదైనా డిగ్రీ, సీఏ(ఫైనల్‌), పీజీ, పీజీ డిప్లొమా/ ఎంబీఏ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల పని అనుభవం.
వయసు: 30 ఏళ్లు మించకూడదు. ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తు 
చివరితేది: 28.09.2018. వెబ్‌సైట్‌: www.hslvizag.in

రైట్స్‌ లిమిటెడ్‌

గుడ్‌గావ్‌లోని రైట్స్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు-ఖాళీలు: డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (ఎలక్ట్రికల్‌)- 04, అసిస్టెంట్‌ మేనేజర్‌(ఎలక్ట్రికల్‌)- 04, ఇంజినీర్‌ (ఎల‌్రక్టికల్‌)- 05.
అర్హత: ఇంజినీరింగ్‌ డిగ్రీ(ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ ఖీ ఎలక్ట్రానిక్స్‌) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 19.09.2018. వెబ్‌సైట్‌:http://ritesltd.com/

అప్రెంటిస్‌షిప్‌
ఆగ్నేయ మధ్య రైల్వేలో అప్రెంటిస్‌ ఖాళీలు

గ్నేయ మధ్య రైల్వే పరిధిలోని నాగ్‌పుర్‌ డివిజన్‌, మోతీబాగ్‌ వర్క్‌షాప్‌లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు.
ట్రేడులు: ఫిట్టర్‌, కార్పెంటర్‌, వెల్డర్‌, ఎలక్ట్రీషియన్‌, స్టెనో, ప్లంబర్‌, పెయింటర్‌, వైర్‌మ్యాన్‌, డీజిల్‌ మెకానిక్‌ తదితరాలు.
ఖాళీలు: 313. వయసు: 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: పదోతరగతితో పాటు ఐటీఐ ఉత్తీర్ణత.
ఎంపిక: విద్యార్హత మార్కులు, శారీరక దృఢత్వ/ వైద్య పరీక్షల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 15.09.2018.
వెబ్‌సైట్‌: www.secr.indianrailways.gov.in

ఫెలోషిప్స్‌
తిరుపతి ఐఐఎస్‌ఈఆర్‌లో పీడీఆర్‌ఎఫ్‌ ప్రోగ్రాం

తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌- కింది విభాగాల్లో పోస్ట్‌ డాక్టొరల్‌ రిసెర్చ్‌ ఫెలోషిఫ్‌ (పీడీఆర్‌ఎఫ్‌) ప్రోగ్రాం కోసం దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, మ్యాథమేటిక్స్‌.
అర్హత: సంబంధిత విభాగాల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఫెలోషిప్‌: పీహెచ్‌డీ పూర్తి చేసిన అభ్యర్థులకు నెలకు రూ.40,000 తోపాటు హెచ్‌ఆర్‌ఏ, పీహెచ్‌డీ ఫలితాల కోసం నిరీక్షిస్తున్నవారికి నెలకు రూ.30,000, హెచ్‌ఆర్‌ఏ ఉంటుంది.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 20.09.2018. www.iisertirupati.ac.in

వాక్‌ ఇన్స్‌
పరిశోధన ఖాళీలు

పెదవేగిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ పామ్‌ రిసెర్చ్‌(ఐఐవోపీఆర్‌)- తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టు-ఖాళీలు: రిసెర్చ్‌ అసోసియేట్‌- 01, యంగ్‌ ప్రొఫెషనల్‌- 01.
అర్హత: ఎంఎస్సీ/ పీహెచ్‌డీ(అగ్రి బయోటెక్నాలజీ/ బయోటెక్నాలజీ) ఉత్తీర్ణత. పని అనుభవానికి ప్రాధాన్యం.
ఇంటర్వ్యూ తేది: 12.09.2018.
వేదిక: ఐఐవోపీఆర్‌, పెదవేగి, పశ్చిమగోదావరి జిల్లా, ఏపీ.
వెబ్‌సైట్‌: www.dopr.gov.in మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని