నోటీస్‌బోర్డు

తెలంగాణలోని ములుగు అటవీ కళాశాల, పరిశోధన సంస్థలో కింది ఖాళీల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ప్రకటన జారీ చేసింది....

Published : 12 Sep 2018 01:36 IST

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
ములుగు అటవీ కళాశాలలో బోధనా ఖాళీలు  

తెలంగాణలోని ములుగు అటవీ కళాశాల, పరిశోధన సంస్థలో కింది ఖాళీల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ప్రకటన జారీ చేసింది.
పోస్టులు: ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
ఖాళీలు: 24.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, నెట్‌/ స్లెట్‌/ సెట్‌ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధనానుభవం ఉండాలి.
వయస్సు: 21 నుంచి 58 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు: 15.09.2018 నుంచి 01.10.2018 వరకు.
వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/

బీఎస్‌ఎన్‌ఎల్‌లో 198 జేటీవో పోస్టులు  

న్యూదిల్లీలో భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌) గేట్‌-2019 ద్వారా జూనియర్‌ టెలికామ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి సూచనాత్మక ప్రకటనను విడుదల చేసింది.స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ కింద ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
పోస్టు-ఖాళీలు: జూనియర్‌ టెలికం ఆఫీసర్‌ (ఎలక్ట్రికల్‌ / సివిల్‌)- 198.
అర్హత: బీఈ/ బీటెక్‌(ఎల‌క్ట్రికల్‌/ సివిల్‌), గేట్‌ 2019 ఉత్తీర్ణత.
* ఎంపిక, దరఖాస్తు తేదీలు తదితర వివరాలకు ‌www.bsnl.co.in చూడవచ్చు.

అప్రెంటిస్‌షిప్‌
ఎల‌క్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా  

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌)లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీ.
ఖాళీలు: 250.
ట్రేడులు: ఫిట్టర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, ప్లంబర్‌, కార్పెంటర్‌, డీజిల్‌/ ఎల‌క్ట్రానిక్స్‌ మెకానిక్‌ తదితరాలు. 
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 14 ఏళ్లు తగ్గకూడదు.
ఎంపిక: విద్యార్హత మార్కుల ఆధారంగా.
ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 28.09.2018.
వెబ్‌సైట్‌:www.ecil.co.in

ఎన్‌పీసీఐఎల్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు  

న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ పరిధిలోని తారాపూర్‌ అణు విద్యుత్‌ కేంద్రంలో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు. ట్రేడులు: ఫిట్టర్‌, టర్నర్‌, ఎల‌క్ట్రీషియన్‌, వెల్డర్‌, కార్పెంటర్‌, ప్లంబర్‌, వైర్‌మ్యాన్‌, పెయింటర్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 16 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: విద్యార్హత మార్కులు, వైద్య పరీక్షల ఆధారంగా.
ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 10.10.2018.
వెబ్‌సైట్‌:http://www.npcil.co.in/

వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ
సీఐఎంఎఫ్‌ఆర్‌లో ప్రాజెక్టు అసిస్టెంట్లు

సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మైనింగ్‌ అండ్‌ ఫ్యూయల్‌ రిసెర్చ్‌(సీఐఎంఎఫ్‌ఆర్‌) పరిధిలోని బిలాస్‌పూర్‌ ప్రాంతీయ కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టు-ఖాళీలు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్లు(లెవెల్‌-1, 2)- 67.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత.
వయసు: లెవెల్‌ 1 పోస్టులకు 28 ఏళ్లు, లెవెల్‌ 2 పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీలు: 2018 సెప్టెంబరు 27, 28, 29, 30.
వేదిక: సీఐఎంఎఫ్‌ఆర్‌, బిలాస్‌పూర్‌ ప్రాంతీయ కార్యాలయం, బిలాస్‌పూర్‌, ఛత్తీస్‌గఢ్‌.
వెబ్‌సైట్‌: http://cimfr.nic.in/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని