అప్రెంటిస్‌షిప్ సీఐటీడీ, హైదరాబాద్
హైదరాబాద్‌లోని భారత సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. * ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు: 15 కాల వ్యవధి: ఒక ఏడాది అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. దరఖాస్తు: ఆన్‌లైన్. చివరి తేది: అక్టోబరు 13 వెబ్‌సైట్:http://www.citdindia.org/
|
ప్రభుత్వ ఉద్యోగాలు ఏపీ సీఆర్‌డీఏ
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ) ఫైనాన్స్ విభాగంలో కింది కాంట్రాక్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు-ఖాళీలు: సీనియర్ ఎగ్జిక్యూటివ్-02, ఎగ్జిక్యూటివ్-02 అర్హత: ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణత, అనుభవం. దరఖాస్తు: ఆన్‌లైన్. చివరి తేది: సెప్టెంబరు 24 వెబ్‌సైట్:https://crda.ap.gov.in/
|
నేవీలో ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్లు
ఇండియన్ నేవీ వివిధ విభాగాల్లో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అవివాహిత పురుషులు, మహిళలు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టు: ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఖాళీలు: 37 విభాగాలవారీ ఖాళీలు: లాజిస్టిక్స్-20, ఐటీ-15, లా-02. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత. ఎంపిక: ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తు: ఆన్‌లైన్ చివరి తేది: అక్టోబరు 5 వెబ్‌సైట్:https://www.joinindiannavy.gov.in/
|
పవర్‌గ్రిడ్‌లో ట్రైనీలు
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింది ట్రైనీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టు: ట్రైనీ ఖాళీలు: 58 విభాగాలవారీ ఖాళీలు: డిప్లొమా-30, జూనియర్ ఆఫీసర్ (హెచ్‌ఆర్)-03, జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్)-25. అర్హత: సంబంధిత విభాగాల్లో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, పీజీ డిప్లొమా/ ఎంహెచ్‌ఆర్‌ఎం/ ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంబీఏ ఉత్తీర్ణత. వయసు: 27 ఏళ్లు మించకూడదు. ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్. చివరి తేది: అక్టోబరు 2 వెబ్‌సైట్:https://www.powergridindia.com/
|
ఈశాన్య రైల్వే
గోరఖ్‌పూర్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈశాన్య రైల్వే 2018-19 సంవత్సరానికి గాను కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: కల్చరల్ కోటా, స్పోర్ట్స్ కోటా. ఖాళీలు: 23 అర్హత: పదోతరగతి, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత. మ్యూజిక్/ డ్యాన్స్‌లో పీజీ డిగ్రీ/ డిప్లొమా/ సర్టిఫికెట్, సంబంధిత క్రీడా నైపుణ్యాలు ఉండాలి. ఎంపిక: రాతపరీక్ష, క్రీడా విజయాల మదింపు, మ్యూజిక్/ డ్యాన్స్‌లో ప్రతిభ ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్. దరఖాస్తు ఫీజు: రూ.500. చివరి తేది: అక్టోబరు 15 వెబ్‌సైట్:http://www.ner.indianrailways.gov.in/
|
పారా మెడికల్ స్టాఫ్
సింగ్రౌలి (మధ్యప్రదేశ్)లోని నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టు: పారా మెడికల్ స్టాఫ్ ట్రైనీ ఖాళీలు: 53 (స్టాఫ్ నర్స్-48, టెక్నీషియన్-05) అర్హత: పదోతరగతి, ఇంటర్, సంబంధిత విభాగాల్లో డిప్లొమా/ సర్టిఫికెట్, ప్రత్యేక శిక్షణ. వయసు: 30 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్. ఆన్‌లైన్ దరఖాస్తు: అక్టోబరు 8 నుంచి నవంబరు 12 వరకు. హార్డు కాపీలను పంపడానికి చివరి తేది: డిసెంబరు 12. వెబ్‌సైట్: http://www.nclcil.in/
|
వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఎన్‌బీఎఫ్‌జీఆర్, లఖ్‌నవూ
లఖ్‌నవూలోని ఐకార్-నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ (ఎన్‌బీఎఫ్‌జీఆర్) కింది కాంట్రాక్టు పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. పోస్టులు-ఖాళీలు: సీనియర్ రిసెర్చ్ ఫెలో-04, యంగ్ ప్రొఫెషనల్-06. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ, అనుభవం. వయసు: ఎస్‌ఆర్‌ఎఫ్ పోస్టులకు 35 ఏళ్లు, యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు 21-45 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: అకడమిక్ ప్రతిభ, పరిశోధన అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేది: సెప్టెంబరు 19 వేదిక: ఐకార్ - ఎన్‌బీఎఫ్‌జీఆర్, లఖ్‌నవూ. వెబ్‌సైట్:http://www.nbfgr.res.in/
|
మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు |