నోటీస్‌బోర్డు

నోయిడాలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌) కింది కాంట్రాక్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.;;;

Published : 18 Sep 2018 01:41 IST

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
బీఈసీఐఎల్‌, నోయిడా

నోయిడాలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌) కింది కాంట్రాక్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: అకౌంట్‌ ఎగ్జిక్యూటివ్‌, రికార్డ్‌ కీపర్‌ తదితరాలు.
అర్హత: ఇంటర్‌, బీకాం, ఎంకాం, అనుభవం.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌
దరఖాస్తు ఫీజు: రూ.500
చివరి తేది: సెప్టెంబరు 28
వెబ్‌సైట్‌:http://www.becil.com/vacancies

ఇండియా పోస్ట్‌  

కోల్‌కతాలోని భారత తపాలా (ఇండియా పోస్ట్‌) విభాగానికి చెందిన మెయిల్‌ మోటార్‌ సర్వీస్‌లో స్కిల్డ్‌ ఆర్టిజన్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టు: స్కిల్డ్‌ ఆర్టిజన్‌
ఖాళీలు: 19 
అర్హత: సంబంధిత ట్రేడులో సర్టిఫికెట్‌ లేదా ఎనిమిదో తరగతి ఉత్తీర్ణతతోపాటు ఏడాది అనుభవం, డ్రైవింగ్‌ లైసెన్స్‌.
వయసు: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: కాంపిటీటివ్‌ ట్రేడ్‌ టెస్ట్‌ ద్వారా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌
చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (15-21 సెప్టెంబరు 2018)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 60 రోజుల్లోపు.
https://www.indiapost.gov.in/

ఫెలోషిప్‌
ఆయుష్‌ నెట్‌ - 2018

దేశవ్యాప్తంగా ఆయుష్‌ విద్యకు సంబంధించి పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి నిర్వహించే ఆయుష్‌ నెట్‌ ప్రకటన విడుదలైంది. న్యూదిల్లీలోని సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్సెస్‌ ఈ పరీక్షను నిర్వహిస్తోంది.
* ఆయుష్‌ - నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌), 2018
అర్హత: సంబంధిత విభాగాల్లో పీజీ (ఎండీ/ ఎంఎస్‌) లేదా గ్రాడ్యుయేషన్‌తోపాటు అనుభవం.
ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌ ఆధారంగా.
పరీక్ష (ఆయుష్‌ నెట్‌) తేది: నవంబరు 13
దరఖాస్తు: ఆన్‌లైన్‌.
ఆన్‌లైన్‌ దరఖాస్తు: సెప్టెంబరు 20 నుంచి అక్టోబరు 3.
వెబ్‌సైట్‌:http://www.ccras.nic.in/node/1152

వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ
సీఐపీహెచ్‌ఈటీ, లూధియానా  

లుథియానా (పంజాబ్‌)లోని ఐకార్‌ - సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ హార్వెస్ట్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీఐపీహెచ్‌ఈటీ) కింది కాంట్రాక్టు పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టులు: యంగ్‌ ప్రొఫెషనల్‌
ఖాళీలు: 17
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, మాస్టర్స్‌ డిగ్రీ, అనుభవం.
వయసు: 21 - 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఇంటర్వ్యూ తేది: అక్టోబరు 1, 3
వేదిక: ఐకార్‌-సీఐపీహెచ్‌ఈటీ, పంజాబ్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ క్యాంపస్‌, లూధియానా - 141004.
వెబ్‌సైట్‌: https://www.ciphet.in/

సీసీఆర్‌ఏఎస్‌ జీఐడీ

గువాహటిలోని రీజనల్‌ ఆయుర్వేద రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ జీఐడీ... కింది కాంట్రాక్టు పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టులు-ఖాళీలు: ఎస్‌ఆర్‌ఎఫ్‌ (ఆయుర్వేద)-14, సోషల్‌ వర్కర్‌ (ఫిమేల్‌)-01.
అర్హత: బీఏఎంఎస్‌, పీజీ (సోషియాలజీ) ఉత్తీర్ణత.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
ఇంటర్వ్యూ తేది: సెప్టెంబరు 22
వేదిక: కాన్ఫరెన్స్‌ హాల్‌, రీజనల్‌ ఆయుర్వేద రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ జీఐడీ, గువాహటి.
వెబ్‌సైట్‌:http://ccras.nic.in/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం ‌www.eenadupratibha.net చూడవచ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని