నోటీస్‌బోర్డు

న్యూదిల్లీలోని ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఈఎస్‌ఐసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ...

Published : 19 Sep 2018 01:39 IST

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
ఈఎస్‌ఐసీలో 539 సోషల్‌ సెక్యూరిటీ ఆఫీసర్లు 

న్యూదిల్లీలోని ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఈఎస్‌ఐసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
పోస్టు-ఖాళీలు: సోషల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌/ మేనేజర్‌ గ్రేడ్‌-2/ సూపరింటెండెంట్‌- 539.
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. కామర్స్‌/ లా/ మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయేట్లకు, పని అనుభవానికి  ప్రాధాన్యం.
వయసు: 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ప్రాథమిక, ప్రధాన, కంప్యూటర్‌ నైపుణ్య, వివరణాత్మక పరీక్షలు, ధ్రువీకరణపత్రాల పరిశీలన ఆధారంగా.  
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 05.10.2018. 
వెబ్‌సైట్‌: www.esic.nic.in

కోరుకొండ సైనిక పాఠశాల

 విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్‌ స్కూలులో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు.
పోస్టులు: మెడికల్‌ ఆఫీసర్‌, క్రాఫ్ట్‌ ఇన్‌స్ట్రక్టర్‌
అర్హత: ఎంవో ఖాళీలకు ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత, క్రాఫ్ట్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులకు మెట్రిక్యులేషన్‌, ట్రేడ్‌ సర్టిఫికెట్‌తోపాటు ఆంగ్ల మాధ్యమంలో బోధనా సామర్థ్యం ఉండాలి. 
ఆఫ్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: పత్రికల్లో ప్రకటన వెలువడిన తేదీ (18.09.2018) నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్‌:www.sainikschoolkorukonda.org

అప్రెంటిస్‌షిప్‌
హెచ్‌ఏఎల్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు 

బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు దరఖాస్తులు.
ఇంజినీరింగ్‌ విభాగాలు: ఏరోనాటికల్‌/ ఏరోస్పేస్‌, కెమికల్‌, సివిల్‌, కంప్యూటర్‌/ కంప్యూటర్‌ సైన్స్‌ & టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రికల్‌‌, ఎలక్ట్రికల్‌ & ఎలక్ట్రా‌నిక్స్‌, ఏవియానిక్స్‌, మెకానికల్‌, ఇండస్ట్రియల్‌, మెటలర్జీ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత. 
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 07.10.2018.
వెబ్‌సైట్‌: https://hal-india.co.in/

వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ
ఐడీపీఎల్‌, హైదరాబాద్‌

హైదరాబాదులోని ఇండియన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ (ఐడీపీఎల్‌)లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ.
పోస్టులు: డిప్యూటీ మేనేజర్‌, మేనేజర్‌, ఎగ్జిక్యూటివ్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, ప్రొడక్షన్‌ కెమిస్ట్‌, ఆపరేటర్‌ తదితరాలు. 
అర్హత: ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఇంటర్వ్యూ తేదీలు: సెప్టెంబరు 27, 28. 
వేదిక: ఐడీపీఎల్‌ న్యూ ఫార్ములేషన్‌ బ్లాక్‌, బాలానగర్‌, హైదరాబాద్‌. 
వెబ్‌సైట్‌:www.idplindia.in

మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని