Published : 24 Sep 2018 01:38 IST

నోటీస్‌బోర్డు

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
కెనరా బ్యాంక్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌

ముంబయిలోని కెనరా బ్యాంక్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ కింది కాంట్రాక్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: రిసెర్చ్‌ అనలిస్ట్‌, కంపెనీ సెక్రటరీ, ఆఫీసర్‌ తదితరాలు. 
ఖాళీలు: 10
అర్హత: డిగ్రీ, బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ, ఎంబీఏ/ సీఎఫ్‌ఏ ఉత్తీర్ణత, అనుభవం. 
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌. 
చివరి తేది: సెప్టెంబరు 28
వెబ్‌సైట్‌: https://www.canmoney.in/

బెల్‌లో ఇంజినీర్లు 

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌), మచిలీపట్నం యూనిట్‌లో కింది కాంట్రాక్టు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టు: కాంట్రాక్టు ఇంజినీర్‌ 
ఖాళీలు: 11 
విభాగాలవారీ ఖాళీలు: ఎల‌క్ట్రానిక్స్‌-06, మెకానికల్‌-02, కంప్యూటర్‌ సైన్స్‌-01, సివిల్‌-02. 
అర్హత: సంబంధిత బ్రాంచుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.
వయసు: 25 ఏళ్లు మించకూడదు. 
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. 
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌. 
చివరి తేది: అక్టోబరు 10 
వెబ్‌సైట్‌: http://bel-india.in/

ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌ 

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌) కింది ప్రాజెక్ట్‌ పర్సనల్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: టీమ్‌ లీడర్‌, ఎక్స్‌పర్ట్‌, యంగ్‌ ప్రొఫెషనల్‌ తదితరాలు. 
ఖాళీలు: 13 
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌ 
చివరి తేది: అక్టోబరు 8 
వెబ్‌సైట్‌: http://nird.org.in/

ఆర్‌సీబీ, ఫరీదాబాద్‌

 ఫరీదాబాద్‌ (హరియాణా)లోని రీజనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ (ఆర్‌సీబీ) కింది కాంట్రాక్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: టెక్నికల్‌ ఆఫీసర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, అప్లికేషన్‌ సైంటిస్ట్‌ తదితరాలు. 
ఖాళీలు: 24 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ, ఎంబీఏ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత, అనుభవం. 
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా. 
దరఖాస్తు: ఆన్‌లైన్‌. 
దరఖాస్తు ఫీజు: రూ.500.
చివరి తేది: అక్టోబరు 8
వెబ్‌సైట్‌: http://rcb.res.in/

ప్రవేశాలు
ఐఐటీ బాంబే - సీడ్‌ 2019

దేశవ్యాప్తంగా ఐఐటీ తదితర ప్రఖ్యాత జాతీయ విద్యా సంస్థల్లోని డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీడ్‌ ప్రకటన విడుదలైంది. ఐఐటీ బాంబే ఈ పరీక్షను నిర్వహిస్తోంది.
* కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌ (సీడ్‌) 2019
కోర్సులు: బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బీడిజైన్‌), మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎండిజైన్‌), పీహెచ్‌డీ.
అర్హత: 2018లో పూర్తయిన లేదా 2019లో పూర్తి కాబోయే ఇంటర్‌, సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ లేదా డిప్లొమా అభ్యర్థులు అర్హులు. 
ఆన్‌లైన్‌ దరఖాస్తు: 2018 అక్టోబరు 9 నుంచి నవంబరు 16 వరకు.
వెబ్‌సైట్‌: http://www.uceed.iitb.ac.in/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు