Published : 25 Sep 2018 01:31 IST

నోటీస్‌బోర్డు

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
ఎన్‌ఐపీసీసీడీ, న్యూదిల్లీ  

న్యూదిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ (ఎన్‌ఐపీసీసీడీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: అసిస్టెంట్‌ డైరెక్టర్‌, రిసెర్చ్‌ అసిస్టెంట్‌ తదితరాలు.
ఖాళీలు: 36
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్‌, డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్‌, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌
దరఖాస్తు ఫీజు: రూ.250
చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (22-28 సెప్టెంబరు 2018)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.
వెబ్‌సైట్‌: http://nipccd.nic.in/

విశాఖపట్నం కస్టమ్స్‌ కార్యాలయం 

విశాఖపట్నంలోని భారత ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ప్రిన్సిపల్‌ కమిషనర్‌ ఆఫ్‌ కస్టమ్స్‌ కార్యాలయం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: సీమ్యాన్‌, గ్రీజర్‌, లాంచ్‌ మెకానిక్‌, సీనియర్‌ డెక్‌ హ్యాండ్‌ తదతరాలు.
ఖాళీలు: 14,
వర్క్‌ లొకేషన్‌: విశాఖపట్నం.
అర్హత: పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణత, అనుభవం. సంబంధిత విభాగాల్లో సర్టిఫికెట్‌ కోర్సులు చేసినవారికి ప్రాధాన్యం ఇస్తారు.
వయసు: లాంచ్‌ మెకానిక్‌, సీనియర్‌ డెక్‌ హ్యాండ్‌ పోస్టులకు 18-30 ఏళ్లు; మిగిలిన వాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ద్వారా.
పరీక్ష తేది: 2019 జనవరి 20
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌.
చివరి తేది: అక్టోబరు 12 
వెబ్‌సైట్‌: http://www.vizagcustoms.gov.in/

ఐఐపీలో సైంటిస్టులు 

దేహ్రాదూన్‌లోని సీఎస్‌ఐఆర్‌ - ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం (ఐఐపీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: సీనియర్‌ సైంటిస్ట్‌/సైంటిస్ట్‌, సైంటిస్ట్‌.
ఖాళీలు: 10
అర్హత: సంబంధిత బ్రాంచుల్లో ఎంఈ/ ఎంటెక్‌, పీహెచ్‌డీ, అనుభవం.
వయసు: సైంటిస్టు పోస్టులకు 32 ఏళ్లు, సీనియర్‌ సైంటిస్టు పోస్టులకు 37 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేది: అక్టోబరు 12.
హార్డు కాపీలను పంపడానికి చివరితేది: అక్టోబరు 22
వెబ్‌సైట్‌: http://www.iip.res.in/

ఐఐటీ దిల్లీ 

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) దిల్లీ కింది ప్రాజెక్ట్‌ పర్సనల్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ అటెండెంట్‌ తదితరాలు (తాత్కాలిక).
ఖాళీలు: 11
అర్హత: పదోతరగతి, బీఈ/ బీటెక్‌, ఎంటెక్‌, పీహెచ్‌డీ, అనుభవం.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఈమెయిల్‌,
చివరి తేది: అక్టోబరు 1
వెబ్‌సైట్‌: http://ird.iitd.ac.in/vacancies

ప్రవేశాలు
నిమ్స్‌, హైదరాబాద్‌

హైదరాబాద్‌లోని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) 2018 సంవత్సరానికిగాను కింది కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
1) మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (రెండేళ్లు) (15 సీట్లు)
2) పీజీ పారామెడికల్‌ డిప్లొమా (రెండేళ్లు) (114 సీట్లు)
అర్హత: ఫిజియోథెరపీలో బ్యాచిలర్స్‌ డిగ్రీ, సైన్సు/ లైఫ్‌ సైన్సెస్‌ సబ్జెక్టుల్లో బీఎస్సీ ఉత్తీర్ణత. 
ఎంపిక: అకడమిక్‌ ప్రతిభ/ రాతపరీక్ష ఆధారంగా. 
పరీక్ష తేది: అక్టోబరు 15 
దరఖాస్తు: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: అక్టోబరు 1
హార్డు కాపీలను పంపడానికి చివరి తేది: అక్టోబరు 3
వెబ్‌సైట్‌: https://nims.edu.in/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని