నోటీస్‌బోర్డు

హైదరాబాద్‌లోని ఎల‌క్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీ.....

Published : 26 Sep 2018 01:31 IST

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
ఈసీఐఎల్‌లో 506 ఖాళీలు 

హైదరాబాద్‌లోని ఎల‌క్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీ.
పోస్టు-ఖాళీలు: జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌- 100, జూనియర్‌ కన్సల్టెంట్‌(ఫీల్డ్‌ ఆపరేషన్‌)- 406.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ(ఎల‌క్ట్రానిక్‌/ మెకానిక్‌/ ఆర్‌ & టీవీ/ ఎల‌క్ట్రికల్‌/ ఫిట్టర్‌), ఏదైనా ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ/ బీటెక్‌(ఎల‌క్ట్రానిక్స్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రానిక్స్‌ & ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఎల‌క్ట్రికల్‌ & ఎల‌క్ట్రానిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌) చదివి ఉండాలి. మొదటి శ్రేణి ఉత్తీర్ణతకు, పని అనుభవానికి ప్రాధాన్యం.
వయసు: జేటీవో పోస్టులకు 28 ఏళ్లు, జేసీ ఖాళీలకు 25 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 29.09.2018.
వెబ్‌సైట్‌: www.ecil.co.in

శ్రీకాకుళం జిల్లాలో బ్యాక్‌లాగ్‌ పోస్టులు 

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం- డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ ద్వారా బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి స్థానిక ఎస్సీ/ ఎస్టీ  అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు-ఖాళీలు: జూనియర్‌ అసిస్టెంట్‌- 03, జూనియర్‌ అసిస్టెంట్‌ కం టైపిస్ట్‌- 01, టైపిస్ట్‌- 05, జూనియర్‌ అకౌంటెంట్‌- 06, డిప్యూటీ సర్వేయర్‌- 02, బిల్‌ కలెక్టర్‌- 02, టెక్నికల్‌ అసిస్టెంట్‌- 03. మొత్తం ఖాళీలు- 22.
అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్‌, ఏదైనా డిగ్రీ, తెలుగు హయ్యర్‌ టైప్‌రైటింగ్‌, కంప్యూటర్‌ సర్టిఫికెట్‌ కోర్సులు, ఐటీఐ(డ్రాఫ్ట్స్‌మన్‌) ఉత్తీర్ణత.
వయసు: 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. 
ఎంపిక: విద్యార్హత మార్కుల ఆధారంగా.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 29.09.2018.
వెబ్‌సైట్‌:www.srikakulam.ap.gov.in

ఎన్‌ఆర్‌టీఐలో బోధన ఖాళీలు

వడోదర (గుజరాత్‌)లోని నేషనల్‌ రైల్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో బోధన ఖాళీలకు దరఖాస్తులు.
పోస్టులు: ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(కాంట్రాక్ట్‌).
విభాగాలు: ట్రాన్స్‌పోర్టేషన్‌ టెక్నాలజీ, సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, డిజైన్‌, ఎకనామిక్స్‌, ఎన్విరాన్‌మెంట్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ, స్లెట్‌/ సెట్‌ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధనానుభవం ఉండాలి.
* వయసు, ఎంపిక, దరఖాస్తు విధానం వివరాలకు ఎన్‌ఆర్‌టీఐ వెబ్‌సైట్‌ చూడవచ్చు.
దరఖాస్తు చివరితేది: 05.10.2018.
వెబ్‌సైట్‌: https://nrti.edu.in/

బీపీసీఎల్‌లో క్రాఫ్ట్స్‌మన్‌ పోస్టులు 

ముంబయిలోని భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు-ఖాళీలు: క్రాఫ్ట్స్‌మన్‌(మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ ఇన్‌స్ట్రుమెంట్‌)- 20, ప్రాసెస్‌ టెక్నీషియన్‌- 05.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత, పని అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత, నైపుణ్య, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ తేదీలు: 29.09.2018 నుంచి 14.10.2018 వరకు.
www.bharatpetroleum.com

మరిన్ని నోటిఫికేషన్ల కోసం ‌www.eenadupratibha.net చూడవచ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని