ఇంటర్‌తో ఆర్కియాలజీ చ‌ద‌వ‌చ్చా?

ఇంటర్ (ఎంఈసీ) పూర్తిచేశాను. పురావస్తు శాస్త్రవేత్త ( ఆర్కియాలజిస్టు) కావాలనుకుంటున్నాను. ఎలా?

Published : 15 Jan 2016 17:04 IST

ఇంటర్‌తో ఆర్కియాలజీ చ‌ద‌వ‌చ్చా?


ఇంటర్‌ (ఎంఈసీ) పూర్తిచేశాను. పురావస్తు శాస్త్రవేత్త (ఆర్కియాలజిస్టు) కావాలనుకుంటున్నాను. ఎలా? - ఆశ్రిత్‌ కృష్ణ

జ: పురావస్తుశాస్త్రవేత్త కావాలనుకునేవారు డిగ్రీ, పీజీల్లో హిస్టరీ, ఆర్కియాలజీ, ఆంత్రపాలజీ, సోషియాలజీ లేదా జియాలజీల్లో ఏదో ఒకదాన్ని చదివుండాలి. మన తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్ర, ఉస్మానియా, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, కాకతీయ; ఇంకా అన్నామలై మొదలైన విశ్వవిద్యాలయాలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో బనారస్‌ హిందూ  విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్‌ ముంబయి, యూనివర్సిటీ ఆఫ్‌ పుణె, యూనివర్సిటీ ఆఫ్‌ మైసూర్‌, యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌,  యూనివర్సిటీ ఆఫ్‌ రాజస్థాన్‌, పాండిచ్చేరి, విశ్వభారతి, నాగ్‌పూర్‌ విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీ ఆఫ్‌ కోల్‌కతా, దిల్లీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెరిటేజ్‌ రీసెర్చ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌  మొదలైన విశ్వవిద్యాలయాలు కూడా ఈ కోర్సులను అందిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు