ఎంబీఏ (హెచ్ ఆర్) చేయొచ్చా?

బీటెక్ పూర్తిచేశాను. ఎంబీఏ (హెచ్ఆర్) దూరవిద్య చేయాలనుకుంటున్నాను. అందించే విశ్వవిద్యాలయం, ప్రవేశపరీక్షల వివరాలు తెలపండి.

Published : 15 Jan 2016 17:08 IST

నేను ఎంబీఏ (హెచ్ ఆర్) చేయొచ్చా..?


  బీటెక్‌ పూర్తిచేశాను. ఎంబీఏ (హెచ్‌ఆర్‌) దూరవిద్య చేయాలనుకుంటున్నాను. అందించే విశ్వవిద్యాలయం, ప్రవేశపరీక్షల వివరాలు తెలపండి. - వెంకీ

 

దూరవిద్య ద్వారా ఎంబీఏ చేయాలనుకునేవారికి ముఖ్యంగా ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ), బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలలో అవకాశాలు న్నాయి.  ఇగ్నోలో ఎంబీఏ చేయాలనుకునేవారు ఓపెన్‌ మ్యాట్‌ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షను జులై, డిసెంబర్‌ నెలల్లో రెండుసార్లు నిర్వహిస్తారు. బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఐసెట్‌ ద్వారా ప్రవేశాలు జరుగుతాయి. ఇగ్నో, అంబేడ్కర్‌ యూనివర్సిటీల్లో ఎంబీఏ కోర్సు కాలవ్యవధి 3 సంవత్సరాలు. హెచ్‌ఆర్‌ అనేది ఎంబీఏలో ఒక స్పెషలైజేషన్‌ మాత్రమే. 

ప్రత్యేకంగా ఎంబీఏ (హెచ్‌ఆర్‌) అనే కోర్సు ఉండదు.  హెచ్‌ఆర్‌తోపాటుగా మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, ఆపరేషన్స్‌ సిస్టమ్స్‌ స్పెషలైజేషన్లలో కూడా ఎంబీఏ చేయవచ్చు. వీటితోపాటు పైన చెప్పిన రెండు విశ్వవిద్యాలయాల్లో కూడా ఎంబీఏ దూరవిద్య ద్వారా చేయవచ్చు. అందుబాటులో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు- ఉస్మానియా, కాకతీయ, ఆంధ్ర, నాగార్జున, శ్రీవెంకటేశ్వర మొదలైనవాటిలో రెండు సంవత్సరాల్లో దూరవిద్య ద్వారా ఎంబీఏ పూర్తిచేయవచ్చు. వీటిల్లో చాలా విశ్వవిద్యాలయాలు ఐసెట్‌ ద్వారా, ప్రత్యేక పరీక్ష ద్వారా ప్రవేశాలు జరుపుతున్నాయి. ప్రవేశపరీక్షలో ఇంగ్లిష్‌, మెంటల్‌ ఎబిలిటీ, అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌, లాజికల్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, వ్యాపార సంబంధిత పదాలు మొదలైనవాటిలో బహుళైచ్ఛిక ప్రశ్నల ద్వారా పరీక్ష నిర్వహిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని