దూర విద్య‌లో హార్టీక‌ల్చ‌ర్ ఉందా?

బీఎస్సీ ఫిషరీస్, అగ్రికల్చర్, సెరీ కల్చర్, హార్టీకల్చర్ కోర్సులను దూరవిద్య ద్వారా చదవడం వీలవుతుందా? అందించే విశ్వవిద్యాలయాలు, విద్యార్హతల వివరాలు తెలియజేయండి.

Published : 15 Jan 2016 17:18 IST

దూర విద్య‌లో హార్టీక‌ల్చ‌ర్ ఉందా?

 

బీఎస్‌సీ ఫిషరీస్‌, అగ్రికల్చర్‌, సెరీ కల్చర్‌, హార్టీకల్చర్‌ కోర్సులను దూరవిద్య ద్వారా చదవడం వీలవుతుందా? అందించే విశ్వవిద్యాలయాలు, విద్యార్హతల వివరాలు తెలియజేయండి.- జె. గంగాధర్‌

బీఎస్‌సీ- ఫిషరీస్‌, అగ్రికల్చర్‌, సెరీకల్చర్‌, హార్టీకల్చర్‌ కోర్సులను చదవడానికి ఇంటర్‌ అర్హత ఉండాలి. కానీ బీఎస్‌సీ ఫిషరీస్‌, అగ్రికల్చర్‌, సెరీకల్చర్‌, హార్టీకల్చర్‌ కోర్సులను సాధారణంగా ఏ విశ్వవిద్యాలయాలూ దూరవిద్య ద్వారా అందించవు. ఈ కోర్సులను రెగ్యులర్‌ విధానంలోనే చేయాల్సి ఉంటుంది.

అతి తక్కువ విశ్వవిద్యాలయాలు- యశ్వంత్‌రావు చావన్‌- మహారాష్ట్ర ఓపెన్‌ యూనివర్సిటీ, ఇగ్నో లాంటి విశ్వవిద్యాలయాలు డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌, సర్టిఫికెట్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఇవి ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాల కాలపరిమితితో ఉంటాయి. ఈ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులను కూడా ఫుల్‌టైం చేయాల్సి ఉంటుంది. బీఎస్‌సీ- ఫిషరీస్‌, అగ్రికల్చర్‌, సెరీకల్చర్‌, హార్టీకల్చర్‌ లాంటి కోర్సులను దూరవిద్య ద్వారా చదవడం కంటే నేరుగా ఫుల్‌టైం చదవడమే మేలు. ఎందుకంటే ఏ కోర్సు అయినా దూరవిద్య ద్వారా చదవడం కంటే నేరుగా చదవడం వల్ల సబ్జెక్టుపట్ల జ్ఞానం, నైపుణ్యాలు పెంపొందుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని