ఏ పోటీ ప‌రీక్ష‌లు రాయొచ్చు?

మా అమ్మాయి బీటెక్ (ప్లానింగ్) మూడో సంవత్సరం చదువుతోంది. తరువాత ఏయే పోటీ పరీక్షలను రాయవచ్చు? మాస్టర్స్ ఏ బ్రాంచిలో చేస్తే ఉపయోగకరం? ప్రభుత్వ ఉద్యోగావకాశాలెలా ఉంటాయి?

Published : 15 Jan 2016 17:36 IST

ఏ పోటీ ప‌రీక్ష‌లు రాయొచ్చు?


మా అమ్మాయి బీటెక్‌ (ప్లానింగ్‌) మూడో సంవత్సరం చదువుతోంది. తరువాత ఏయే పోటీ పరీక్షలను రాయవచ్చు? మాస్టర్స్‌ ఏ బ్రాంచిలో చేస్తే ఉపయోగకరం? ప్రభుత్వ ఉద్యోగావకాశాలెలా ఉంటాయి? - జాహ్నవి, హైదరాబాద్‌

బీటెక్‌ తరువాత ఉద్యోగం చేయాలనుకుంటే యూపీఎస్‌సీ (యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) వారు నిర్వహించే ఐఈఎస్‌ (ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌), సివిల్‌ సర్వీసెస్‌ లాంటి పోటీపరీక్షలు రాయడానికి అవకాశముంటుంది. బ్యాంకింగ్‌ రంగంలో పనిచేయాలనుకుంటే ఐబీపీఎస్‌, ఎస్‌బీఐలాంటి పరీక్షలను రాయాల్సిఉంటుంది. కొన్ని ప్రభుత్వరంగ సంస్థలైన బీహెచ్‌ఈఎల్‌, బీఈఎల్‌, హెచ్‌ఏఎల్‌, ఏఏఐ, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ మొదలైన సంస్థలు పీఎస్‌యూ (పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌టేకింగ్‌) పోటీపరీక్ష ద్వారా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. పరిశోధన రంగంలోకి అడుగుపెట్టాలనుకుంటే ఇస్రో, బార్క్‌, డీఆర్‌డీఓలాంటి పరీక్షల ద్వారా అవకాశముంటుంది.

భారత్‌లో రక్షణ రంగంలో పనిచేయడానికి సీడీఎస్‌ (కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీస్‌) పరీక్ష ద్వారా ఇండియన్‌ ఏర్‌ఫోర్స్‌, ఆర్మీ, నేవీ మొదలైన రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. ఉన్నత చదువులు చదవాలనుకుంటే గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌) ద్వారా ఎంటెక్‌ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా విదేశాల్లో ఉన్నత చదువుల కోసం జీఆర్‌ఈ, టోఫెల్‌, జీమ్యాట్‌ లాంటి పోటీపరీక్షలు ఉంటాయి. అంతేకాకుండా బీటెక్‌ తరువాత ఎంబీఏ చేయాలనుకుంటే క్యాట్‌, మ్యాట్‌, గ్జాట్‌ మొదలైన పరీక్షల ద్వారా ప్రవేశం పొందవచ్చు.

మాస్టర్స్‌ డిగ్రీలో ఎన్విరాన్‌మెంటల్‌ ప్లానింగ్‌, హౌసింగ్‌, అర్బన్‌ అండ్‌ రీజనల్‌ ప్లానింగ్‌, ట్రాన్స్‌పోర్ట్‌ ప్లానింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్లానింగ్‌, ఇండస్ట్రియల్‌ ఏరియా ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, రూరల్‌ ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, అర్బన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ మొదలైన కోర్సులుంటాయి. మీ అభిరుచినీ, ఆసక్తినీ బట్టి మీకు నచ్చిన బ్రాంచిని ఎన్నుకుని చదవడం మేలు. ఏ బ్రాంచి అయినా తనదైన ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటుంది.

బీటెక్‌ (ప్లానింగ్‌) చదివిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ప్రభుత్వ రంగంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీస్‌ హెచ్‌యూడీఏ, వీయూడీఏ మొదలైనవి. మున్సిపల్‌ కార్పొరేషన్స్‌, అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా, మల్టీనేషనల్‌ కంపెనీలు (అర్బన్‌ ప్లానింగ్‌కు చెందినవి), సాఫ్ట్‌వేర్‌ రంగం, ప్రొఫెషనల్‌ ఇండస్ట్రీ, ప్రొఫెషనల్‌ ప్రాక్టీస్‌ (అర్బన్‌ ప్లానర్‌), డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ జాగ్రఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ ప్లానింగ్‌ సాఫ్ట్‌వేర్‌ మొదలైన రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని