ICFAI వర్సిటీలో బీటెక్‌

డీమ్డ్‌ విశ్వవిద్యాలయమైన ఐసీఎఫ్‌ఏఐ ఫౌండేషన్‌ ఫర్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (IFHE) నాలుగేళ్ళ బీటెక్‌ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Published : 28 Mar 2016 02:27 IST

ICFAI వర్సిటీలో బీటెక్‌

డీమ్డ్‌ విశ్వవిద్యాలయమైన ఐసీఎఫ్‌ఏఐ ఫౌండేషన్‌ ఫర్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (IFHE) నాలుగేళ్ళ బీటెక్‌ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దీనిలో 8 సెమిస్టర్లుంటాయి. ఈ క్యాంపస్‌ ఆధారిత ఫుల్‌టైమ్‌ కోర్సును సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచిల్లో అందిస్తున్నారు.

ఐఎఫ్‌హెచ్‌ఈ దేశవ్యాప్తంగా నిర్వహించే ఆలిండియా ప్రవేశపరీక్ష (ఏటీఐటీ 2016) స్కోరు ఆధారంగా ఈ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ఏటీఐటీ 2 గంటల వ్యవధిలో ఉండే ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లలో నిర్వహిస్తారు.

* ఆన్‌లైన్‌ టెస్ట్‌: మే 4 నుంచి 18, 2016 వరకూ.

* ఆఫ్‌లైన్‌ టెస్ట్‌: మే 1, 2016. ఈ పేపర్‌ ఆధారిత పరీక్ష తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతిలలో జరుగుతుంది.

10, 12 తరగతుల్లో 60 శాతం అగ్రిగేట్‌ మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు (మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టులు చదివివుండాలి) ఈ ప్రవేశాలకు అర్హులు. 12వ తరగతి/ఇంటర్‌ పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు కూడా దరఖాస్తు చేయవచ్చు.

ఏటీఐటీ 2016 స్కోరు మాత్రమే కాకుండా జేఈఈ మెయిన్‌ 2016, రాష్ట్రస్థాయి/ఇతర జాతీయస్థాయి ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్షల స్కోరును కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఆసక్తి ఉన్నవారు హైదరాబాద్‌ పంజాగుట్ట, నాగార్జున హిల్స్‌లోని ICFAI అడ్మిషన్‌ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఇతర వివరాలకు www.icfaiuniversity.in/ifhe ని చూడవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని