మానవ వనరుల విభాగంలో కోర్సు

దూరవిద్యలో డిగ్రీ పూర్తిచేశాను. హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌లో పీజీ డిప్లొమాను దూరవిద్యలో చేయాలనుకుంటున్నాను. ఏ సంస్థలు ఈ కోర్సును అందిస్తున్నాయి? ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

Published : 30 May 2016 01:52 IST

మానవ వనరుల విభాగంలో కోర్సు

దూరవిద్యలో డిగ్రీ పూర్తిచేశాను. హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌లో పీజీ డిప్లొమాను దూరవిద్యలో చేయాలనుకుంటున్నాను. ఏ సంస్థలు ఈ కోర్సును అందిస్తున్నాయి? ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

- ఎం. మహేష్‌కుమార్‌, పెద్దపల్లి

సాధారణంగా హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును దూరవిద్యలో కంటే నేరుగా చదవటంవల్ల ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ విశ్వవిద్యాలయాలు పీజీ డిప్లొమా ఇన్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌/హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును అందిస్తున్నాయి. అందులో ముఖ్యంగా యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, ఇగ్నో, ఆంధ్ర, కాకతీయ, ఆచార్య నాగార్జున, శ్రీ వేంకటేశ్వర మొదలైన విశ్వవిద్యాలయాలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీలు.. ఉదాహరణకు- అన్నామలై లాంటివి కూడా ఈ కోర్సును అందిస్తున్నాయి.

సాధారణంగా హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును దూరవిద్యలో కంటే నేరుగా చదవటంవల్ల ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని పరిస్థితులూ అనుకూలంగా ఉన్నపుడు రెగ్యులర్‌గా చదవటానికే ప్రయత్నించండి. ఎందుకంటే... దూరవిద్య ద్వారా కంటే రెగ్యులర్‌గా చదవటం వల్ల సబ్జెక్టు పట్ల అవగాహన ఎక్కువగా ఉంటుంది.

హెచ్‌ఆర్‌ మేనేజ్‌మెంట్‌/డెవలప్‌మెంట్‌ చదవటం వల్ల హెచ్‌ఆర్‌ జనరలిస్టు, స్టాఫింగ్‌ డైరెక్టర్‌, కాంపన్సేషన్‌ మేనేజర్‌, టెక్నికల్‌ రిక్రూటర్‌, ఎంప్లాయిమెంట్‌/ప్లేస్‌మెంట్‌ మేనేజర్‌, హెచ్‌ఆర్‌ ట్రెయినింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌, ఎంప్లాయీ రిలేషన్స్‌ మేనేజర్‌, ఆర్గనైజేషనల్‌ డెవలప్మెంట్‌ అండ్‌ చేంజ్‌ కన్సల్టెంటు మొదలైన ఉద్యోగావకాశాలుంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని