ఏరోనాటికల్‌... నానోటెక్నాలజీ

* మా అమ్మాయి ఇంటర్‌ (ఎంపీసీ) రెండో సంవత్సరం చదువుతోంది. మొదటి సంవత్సరం 98% మార్కులు వచ్చాయి.

Published : 01 Aug 2016 01:58 IST

ఏరోనాటికల్‌... నానోటెక్నాలజీ

* మా అమ్మాయి ఇంటర్‌ (ఎంపీసీ) రెండో సంవత్సరం చదువుతోంది. మొదటి సంవత్సరం 98% మార్కులు వచ్చాయి. వైవిధ్యంగా ఉండే కోర్సు చేయాలని తన అభిలాష. నానోటెక్నాలజీ కోర్సు చేస్తే ఎలా ఉంటుంది? దీనికి అవకాశాలెలా ఉంటాయి? ఏరోనాటికల్‌, నానోటెక్నాలజీ.. ఈ రెండింటిలో ఏది మెరుగు?

- హిమబిందు, అమలాపురం

వైవిధ్యంగా ఉండే కోర్సు చదవాలనే మీ అమ్మాయి అభిలాష ప్రశంసనీయం. నానోటెక్నాలజీ వైవిధ్యమైన, ప్రత్యేకమైన కోర్సు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఈరోజుల్లో నానోటెక్నాలజీ అవసరం దాదాపు అన్ని రంగాల్లో ఉంది. ఉదాహరణకు మెడికల్‌, ఫార్మసీ, ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, వస్త్ర పరిశ్రమ మొదలైన రంగాల్లో నానోటెక్నాలజీ అవసరముంది. కాబట్టి, ఈ కోర్సుకి ఈ రోజుల్లో చాలా ఆదరణ ఉంది. ఈ కోర్సును మనదేశంలో ప్రముఖ విశ్వవిద్యాలయాలు/ విద్యాసంస్థలు మాత్రమే అందిస్తున్నాయి.

నానోటెక్నాలజీ కోర్సు చదివినవారికి వైద్య- ఆరోగ్య రంగం, వ్యవసాయం, అంతరిక్షం, పరిశోధన, బోధన మొదలైన రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. దీనితోపాటు ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ కూడా ప్రత్యేకమైన కోర్సే. కాబట్టి మీ అమ్మాయి ఏ కోర్సు చదవాలనేది ఆమెకున్న ఆసక్తి, సామర్థ్యం, నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఏ కోర్సు అయినా తనదైన ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఆసక్తి ఉంటే ఏ కోర్సు చదివినా అందులో రాణించగలుగుతారు. కాబట్టి ఏ కోర్సు పట్ల ఆసక్తి ఉందో అదే చదవడం మేలు.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని