వన్‌టైం ప్రొఫైల్‌లో.. రెండూ నమోదు చేయవచ్చా?

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రెగ్యులర్‌గా 2011-15లో బీఎస్‌సీ (మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కంప్యూటర్స్‌) పూర్తిచేశాను. అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో 2012లో బీఏలో...

Published : 15 Aug 2016 02:16 IST

వన్‌టైం ప్రొఫైల్‌లో.. రెండూ నమోదు చేయవచ్చా?

* ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రెగ్యులర్‌గా 2011-15లో బీఎస్‌సీ (మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కంప్యూటర్స్‌) పూర్తిచేశాను. అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో 2012లో బీఏలో చేరి 2015లో పూర్తిచేశాను. ఇప్పుడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలకు వన్‌టైం ప్రొఫైల్‌ నమోదులో రెండు డిగ్రీలనూ నమోదు చేయాలా లేక ఒకటా? ఏది చేస్తే మేలు?

- ఎ. రామకృష్ణ, పార్వతీపురం, విజయనగరం

సాధారణంగా రెండు డిగ్రీలను ఏకకాలంలో చేయడానికి వీలులేదు. యూజీసీ గతంలో ఈ విషయానికి సంబంధించి ఒక కమిటీని నియమించింది. కానీ ఈ విషయాన్ని గురించి యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌) నిబంధనల్లో ఇప్పటివరకూ స్పష్టత లేదు.

పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ వన్‌టైం ప్రొఫైల్‌ నమోదులో ‘అడిషనల్‌ డిగ్రీ’ అనే ఆప్షన్‌ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు రెండు డిగ్రీలను కావాలనుకుంటే నమోదు చేసుకోవచ్చు. కానీ మీరు రెండు డిగ్రీలను ఏకకాలంలో చదవడం వల్ల రెండింటినీ ఒకేసారి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరిగణనలోకి తీసుకోకపోవచ్చు. దీనిపట్ల సరైన స్పష్టత లేదు.

ఒకవేళ మీరు ఒక డిగ్రీనే నమోదు చేసుకోవాలనుకుంటే ఏ డిగ్రీ అయితే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందో దానిని ఉపయోగించుకోవడం మేలు. మీరు దేనిని నమోదు చేసినా మంచిదే. సాధారణంగా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. ఒకవేళ నోటిఫికేషన్లో ప్రత్యేకంగా ఒక డిగ్రీ అర్హతే ఉండాలని అడిగినపుడు మీరు ఏ డిగ్రీ నమోదు చేసుకుంటారో ఆ డిగ్రీ అర్హతతోగల ఉద్యోగాలకు మీరు అర్హులవుతారు.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని