నానో మెడిసిన్‌ ఎక్కడుంది?

మా అమ్మాయి ఇంటర్‌ (ఎంబైపీసీ) చదువుతోంది. తనకు నానోమెడిసిన్‌పై ఆసక్తి ఉంది....

Published : 05 Sep 2016 02:18 IST

నానో మెడిసిన్‌ ఎక్కడుంది?

* మా అమ్మాయి ఇంటర్‌ (ఎంబైపీసీ) చదువుతోంది. తనకు నానోమెడిసిన్‌పై ఆసక్తి ఉంది. భవిష్యత్తులో తను ఏ కోర్సును ఎంచుకోవాలి? అందించే కళాశాలలేవి?

- డి. చంద్రశేఖర్‌

వైద్య రంగంలో నానోమెడిసిన్‌ ఒక విభిన్నమైన కోర్సు. ఇది నానోటెక్నాలజీ, మెడిసిన్‌ల కలయిక. వైద్యరంగంలో ఇప్పుడిపుడే ఈ కోర్సు అభివృద్ధి చెందుతోంది. కొన్ని దేశాల్లో మాత్రమే ఉదా: అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లో ఈ నానోమెడికల్‌ కోర్సు అందుబాటులో ఉంది. మనదేశంలో ఈ కోర్సు ఇంకా బాల్యదశలోనే ఉంది.
ఈ కోర్సులో బహుళ విభాగాలున్నాయి. ఇది చదవడానికి మెడిసిన్‌తోపాటు నానోటెక్నాలజీ విభాగాల్లో పరిజ్ఞానాన్ని కలిగివుండాలి. నానోమెడిసిన్‌ కోర్సును అందించే విశ్వవిద్యాలయాలు మనదేశంలో అతి తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఈ బహుళ విభాగాల్లో పరిజ్ఞానాన్ని సంపాదించడానికి సమయం పడుతుంది.
దీనిని చదవడానికి మీ అమ్మాయి ముందుగా మెడిసిన్‌ చదివి, తరువాత నానో మెడిసన్‌లో పీహెచ్‌డీ చేయడానికి విదేశాలకు వెళ్లవచ్చు. విదేశాల్లో కొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఉదా:- క్రాన్‌ఫీల్డ్‌ (యూకే) నానోమెడిసిన్‌ కోర్సును అందిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని