గ్రూప్స్‌ రాయడానికి వీలవుతుందా?

ఇంటర్మీడియట్‌ ఫెయిల్‌ అయ్యాను. మూడు సంవత్సరాల తరువాత దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తిచేశాను. నేను బ్యాంకు, గ్రూప్స్‌ పరీక్షలు రాయడానికి అర్హుడినేనా?

Published : 12 Sep 2016 01:25 IST

గ్రూప్స్‌ రాయడానికి వీలవుతుందా?

*ఇంటర్మీడియట్‌ ఫెయిల్‌ అయ్యాను. మూడు సంవత్సరాల తరువాత దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తిచేశాను. నేను బ్యాంకు, గ్రూప్స్‌ పరీక్షలు రాయడానికి అర్హుడినేనా?

- శ్రీను

* ఉద్యోగాన్ని బట్టి విద్యార్హత అవసరం ఉంటుంది. కొన్ని బ్యాంకు ఉద్యోగాలు ఉదాహరణకు- బ్యాంకు క్లర్క్‌ లాంటివి ఇంటర్మీడియట్‌ అర్హతతో ఉంటాయి. కాబట్టి ఈ పరీక్ష రాయడానికి ఇంటర్మీడియట్‌ అవసరం తప్పనిసరి. బ్యాంకు ఐబీపీఎస్‌ లాంటి పరీక్ష రాయడానికి డిగ్రీ అర్హత ఉండాలి. అదేవిధంగా గ్రూప్స్‌కు కూడా.

ఇంటర్మీడియట్‌ అర్హత తప్పనిసరి అని ఇచ్చిన నోటిఫికేషన్లకు అది పాసైనవారే అర్హులు. డిగ్రీ అర్హత అడిగిన వాటికి ఆ అర్హత ఉంటే సరిపోతుంది. కొన్నింటిల్లో ఇంటర్‌, డిగ్రీ రెండింటినీ అడుగుతారు. అలాంటపుడు ఇంటర్మీడియట్‌ లేనివారికి పరీక్ష రాయడానికి అర్హత ఉండదు. ప్రత్యేకంగా ఇంటర్మీడియట్‌ అర్హత ఉండాలని ఇవ్వకపోతే అపుడు ఏ పోటీ పరీక్ష రాయడానికైనా అర్హత ఉంటుంది.

* బైపీసీ (86%) పూర్తిచేశాను. కంప్యూటర్‌ ఫోరెన్సిక్స్‌పై ఆసక్తి ఉంది. డిగ్రీ, పీజీల్లో ఏ కోర్సులు ఎంచుకోవాలి?

- బి.కృష్ణ

* టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవడం చాలా అవసరం. కంప్యూటర్‌ ఫోరెన్సిక్స్‌ వంటి ఆసక్తికరమైన కోర్సును చదవాలనుకోవడం అభినందనీయం. కంప్యూటర్‌ ఫోరెన్సిక్స్‌ అనలిస్ట్‌ కావాలనుకుంటే డిగ్రీలో బ్యాచిలర్‌ సైన్స్‌ ఇన్‌ కంప్యూటర్‌ ఫోరెన్సిక్స్‌/ బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ సైన్స్‌/ బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కోర్సును చేయవచ్చు.

కొన్ని విశ్వవిద్యాలయాలు ఉదాహరణకు- యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ లాంటివి ఫోరెన్సిక్‌ సైన్స్‌లో సర్టిఫికెట్‌ కోర్సులను కూడా అందిస్తున్నాయి. తరువాత పీజీలో మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ కంప్యూటర్‌ ఫోరెన్సిక్స్‌, ఎంఎస్‌సీ ఇన్‌ కంప్యూటర్‌ ఫోరెన్సిక్స్‌ అండ్‌ సైబర్‌ సెక్యూరిటీ లేదా ఎంఎస్‌సీ ఇన్‌ డిజిటల్‌ ఇన్వెస్టిగేషన్‌ అండ్‌ ఫోరెన్సిక్‌ కంప్యూటింగ్‌ లాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్‌ ఫోరెన్సిక్స్‌ లాంటి కోర్సులను చదివేవారు విశ్లేషణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని