‘లా’ కోర్సు ఎలా?

ఎంఏ (సోషల్‌) చేశాను. నెట్‌- జేఆర్‌ఎఫ్‌ రాయాలనుకుంటున్నాను. వివరాలను తెలియజేయండి. నేను డీఎస్‌సీలో భాషా పండిట్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు అర్హుడినేనా?

Published : 28 Nov 2016 01:05 IST

‘లా’ కోర్సు ఎలా?

ఎంఏ (సోషల్‌) చేశాను. నెట్‌- జేఆర్‌ఎఫ్‌ రాయాలనుకుంటున్నాను. వివరాలను తెలియజేయండి. నేను డీఎస్‌సీలో భాషా పండిట్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు అర్హుడినేనా? నాకున్న ఉద్యోగావకాశాలను తెలపండి.

- ఎం. క్రాంతి

నెట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌)ను సంవత్సరంలో రెండుసార్లు నిర్వహిస్తారు. జులై, డిసెంబరు నెలల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్ష రాయడానికి సంబంధిత సబ్జెక్టులో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చదివి ఉండాలి. మరిన్ని వివరాలకు cbsenet.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

భాషా పండిట్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేయడానికి సంబంధిత సబ్జెక్టులో పీజీ/ బాచిలర్‌ డిగ్రీలో ఆ సబ్జెక్టులను కోర్‌ సబ్జెక్టుగా కలిగివుండి, బీఎడ్‌ (బాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌)లో అదే సబ్జెక్టును మెథడాలజీగా చదివి ఉండాలి. భాషా పండిట్‌ పోస్టుకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థి డిగ్రీలో తెలుగు/ హిందీ/ ఇంగ్లిష్‌ మొదలైన భాషలను కోర్‌ సబ్జెక్టులుగా చదివుండాలి. లేదా పీజీలో తెలుగు/ హిందీ/ ఇంగ్లిష్‌ చదివుండాలి. దాంతోపాటు బీఎడ్‌లో మెథడాలజీగానూ చదివివుండాలి. అప్పుడే భాషా పండిట్‌ పోస్టులకు అర్హత ఉంటుంది.

మీరు స్కూల్‌ అసిస్టెంట్‌ (సోషల్‌ స్టడీస్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే, బీఎడ్‌లో సోషల్‌ స్టడీస్‌కు సంబంధించిన సబ్జెక్టులను మెథడాలజీగా చదివితే అర్హత సంపాదించినట్లే.


బీఎస్‌సీ (బీజెడ్‌సీ) చివరి సంవత్సరం చదువుతున్నాను. లా కోర్సు చేయాలని ఉంది. నేను అర్హుడినేనా? అర్హత ఉంటే, దేనిని ఎంచుకుంటే మేలు?

- పవన్‌ కుమార్‌

మీరు లా కోర్సు చేయవచ్చు. ఎల్‌ఎల్‌బీ (బాచిలర్‌ ఆఫ్‌ లా) చదవడానికి ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. కాబట్టి మీరు బీఎస్‌సీ పూర్తయిన తరువాత ఎల్‌ఎల్‌బీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సుకు లాసెట్‌ (కామన్‌ లా ఎంట్రన్స్‌ టెస్ట్‌) ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. తరువాత పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో స్పెషలైజేషన్లు ఉంటాయి.

ఎల్‌ఎల్‌బీ పూర్తయిన తరువాత ఉన్నత చదువులు కొనసాగించాలనుకుంటే ఎల్‌ఎల్‌ఎం (మాస్టర్స్‌ ఆఫ్‌ లా)లో ఆసక్తి ఉన్న స్పెషలైజేషన్‌ను ఎంచుకోవచ్చు. ఎల్‌ఎల్‌ఎంలో కాన్‌స్టిట్యూషన్‌ లా, మర్కంటైల్‌లా, లేబర్‌ లా, పబ్లిక్‌ ఇంటర్నేషనల్‌ లా, క్రైమ్స్‌ అండ్‌ లార్డ్స్‌, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌, ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ అండ్‌ ఎకనామిక్స్‌ లా మొదలైన స్పెషలైజేషన్లు ఉంటాయి.

ప్రతి స్పెషలైజేషన్‌ తనదైన ప్రత్యేకతను కలిగి ఉంటుంది. కాబట్టి ఏ కోర్సును ఎంచుకోవడం మేలో విద్యార్థితో నిమిత్తం లేకుండా కచ్చితంగా చెప్పలేం. మీ ఆసక్తిని బట్టి కోర్సును ఎంచుకోవడం మేలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని