కంప్యూటర్‌ శిక్షణ అవసరమట...

* బీకాం (జనరల్‌) చదివాను. జూనియర్‌/సీనియర్‌ అకౌంటెంట్‌ లాంటి ప్రభుత్వోద్యోగాల కోసం సిద్ధమవుతున్నాను. ఈ మధ్య ఏ పోటీపరీక్షకైనా బీకాం కంప్యూటర్స్‌ వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మిగిలినవారు వ్యాలిడ్‌ కంప్యూటర్‌ కోర్సు నేర్చుకున్నట్లు సర్టిఫికెట్‌ ఉండాలని అడుగుతున్నారు.

Published : 19 Dec 2016 01:45 IST

కంప్యూటర్‌ శిక్షణ అవసరమట...

* బీకాం (జనరల్‌) చదివాను. జూనియర్‌/సీనియర్‌ అకౌంటెంట్‌ లాంటి ప్రభుత్వోద్యోగాల కోసం సిద్ధమవుతున్నాను. ఈ మధ్య ఏ పోటీపరీక్షకైనా బీకాం కంప్యూటర్స్‌ వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మిగిలినవారు వ్యాలిడ్‌ కంప్యూటర్‌ కోర్సు నేర్చుకున్నట్లు సర్టిఫికెట్‌ ఉండాలని అడుగుతున్నారు. ఎంఎస్‌ ఆఫీస్‌, టాలీ లాంటి కోర్సులను ఎక్కడ నేర్చుకోవాలి? - అనిల్‌

* ప్రతి పనికీ కంప్యూటర్‌పైన ఆధారపడుతున్న ఈ రోజుల్లో కంప్యూటర్‌ పరిజ్ఞానం అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే. ప్రైవేటు రంగంలోనే కాకుండా ప్రభుత్వ రంగంలో కూడా ప్రజలకు వివిధ సేవలను అందించటానికి కంప్యూటర్‌ వినియోగం ఎక్కువైంది. అన్ని రంగాల్లోనూ దీని అవసరం అనివార్యమయింది. కాబట్టి మీరు కూడా మీ చదువుకూ, ఉద్యోగానికీ సంబంధించిన కంప్యూటర్‌ కోర్సును నేర్చుకోవడం మంచిది.

చాలావరకూ ప్రైవేటు సంస్థలు వివిధ రకాల కంప్యూటర్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఏదైనా సంస్థలో టాలీ లాంటి కోర్సు అందుబాటులో ఉంటే మీరు అక్కడ నేర్చుకోవచ్చు. ప్రభుత్వం కూడా అందరికీ కంప్యూటర్‌ విద్యను అందించాలనే ఉద్దేశంతో ఉచితంగా కోర్సులను అందిస్తోంది. ఉపాధిని కల్పించడానికి వివిధ రకాల కంప్యూటర్‌ కోర్సుల్లో శిక్షణ కోర్సులు నడుపుతోంది. మీకు దగ్గర్లో నాణ్యమైన శిక్షణను ఇచ్చే ఇలాంటి కేంద్రాలుంటే దానికి దరఖాస్తు చేసుకుని చేరవచ్చు.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని