ఆర్థికశాస్త్రం ఎంత మేలు?

ఎంఏ ఆర్థికశాస్త్రం చదివినవారికి ఏయే రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి?

Published : 23 Jan 2017 02:09 IST

ఆర్థికశాస్త్రం ఎంత మేలు?

* ఎంఏ ఆర్థికశాస్త్రం చదివినవారికి ఏయే రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి? వీరికి స్వయం ఉపాధి పొందే స్వల్పకాలిక కోర్సులు ఏమైనా ఉంటే తెలియజేయండి. - ఎం. సురేష్‌, గుంటూరు 

* ఎంఏ ఆర్థికశాస్త్రం చదివినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ ఉదోగాలైన ఎకనమిక్‌ ప్లానింగ్‌, అనాలిసిస్‌, రక్షణ, రైల్వే, బ్యాంకింగ్‌, విద్య మొదలైన రంగాల్లో ఆర్థికశాస్త్రం చదివినవారికి అవకాశాలుంటాయి. స్వల్పకాలిక కోర్సులు కూడా వివిధ విశ్వవిద్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయి.

ఐఐఎఫ్‌ఎం (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఫైనాన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌) వంటి సంస్థల్లో సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా డిప్లొమా ఇన్‌ ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ అండ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి కోర్సులు కూడా ఉన్నాయి. వీటితోపాటు సర్టిఫికెట్‌ ఇన్‌ అప్లైడ్‌ ఎకనామిక్స్‌, సర్టిఫికెట్‌ ఇన్‌ బిజినెస్‌ ఎకనామిక్స్‌, సర్టిఫికెట్‌ ఇన్‌ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ లాంటి కోర్సులు పరిశీలించవచ్చు. ఈ విధమైన స్వల్పకాలిక కోర్సులు చేయడం వల్ల కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది.


 

* బీఎస్‌సీ (ఎంపీసీ) రెండో సంవత్సరం చదువుతున్నాను. డైట్‌ పూర్తిచేశాను. నాకు గురుకుల కొలువులో అవకాశం ఉందా? నాకు సైకాలజిస్ట్‌ కావాలని ఆసక్తి. ఈ కోర్సుకు అర్హతలేమిటి? సైకాలజీలో పీహెచ్‌డీ చేయాలంటే నెట్‌ అవసరమా? - పల్లవి

* మీకు గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగావకాశం ఉంటుంది. అయితే టెట్‌లో వచ్చిన మార్కులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి మీరు టెట్‌ రాసుంటే మీకు అర్హత ఉన్నట్లే.

మీకు సైకాలజిస్ట్‌ కావాలని ఆసక్తి ఉందన్నారు. కాబట్టి ముందు మీకు దేనిపై ఆసక్తి ఉందో, దానిపైనే శ్రద్ధ వహించండి. రెండింటిపైనా దృష్టిసారిస్తే ఇబ్బందిపడతారు. సైకాలజీపై దృష్టి పెట్టాలనుకుంటే, డిగ్రీ పూర్తయిన తరువాత మళ్లీ బీఎస్‌సీ లేదా బీఏ- సైకాలజీ చదివి, పీజీ సైకాలజీ చదవాల్సి ఉంటుంది. ఆ తరువాత పీహెచ్‌డీ చేయవచ్చు. అయితే, కొన్ని విశ్వవిద్యాలయాలు ఇందుకు నెట్‌ను తప్పనిసరి చేశాయి. మరికొన్ని వాటి ప్రత్యేక పరీక్ష విధానం ద్వారా ప్రవేశాలు కల్పిస్తాయి. మీరు అధ్యాపక వృత్తిని కెరియర్‌గా ఎంచుకుంటే, తప్పనిసరిగా నెట్‌ రాయాల్సి ఉంటుంది. పీహెచ్‌డీ కోసం మాత్రమే అయితే, అది యూనివర్సిటీ ప్రవేశవిధానంపై ఆధారపడి ఉంటుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని