ఏ పాలిటెక్నిక్‌ పరీక్ష మేలు?

మా బాబు సీబీఎస్‌ఈలో పదోతరగతి పూర్తిచేశాడు. స్టేట్‌, సెంట్రల్‌ పాలిటెక్నిక్‌ పరీక్షలు రాశాడు.....

Published : 29 May 2017 01:48 IST

ఏ పాలిటెక్నిక్‌ పరీక్ష మేలు?

* మా బాబు సీబీఎస్‌ఈలో పదోతరగతి పూర్తిచేశాడు. స్టేట్‌, సెంట్రల్‌ పాలిటెక్నిక్‌ పరీక్షలు రాశాడు. ఈ రెండింటిలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి? వీటి ద్వారా జేఈఈ రాసి, ఐఐటీలో చేరవచ్చా? సీఐటీడీలో డిప్లొమాచేసి, ఆపై పీజీ చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగం పొందే వీలుంటుందా?

- ఎం. సుజాత, హైదరాబాద్‌

* మీ బాబుకు ఉన్న ఆసక్తిని బట్టి రెండింటిలో దేనిలో చేర్పించాలో నిర్ణయం తీసుకోండి. ఏ కోర్సు అయినా తనదైన ప్రత్యేకతను కలిగి ఉంటుంది. మీ అబ్బాయికి బీటెక్‌పై ఆసక్తి ఉంటే స్టేట్‌ పాలిటెక్నిక్‌లో చేర్పించండి. దీని తర్వాత బీటెక్‌లో సివిల్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ వంటివి చదవవచ్చు.

టూల్‌ ఇంజినీరింగ్‌, క్యాడ్‌ (కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైనింగ్‌), కామ్‌ (కంప్యూటర్‌ ఎయిడెడ్‌ మానుఫాక్చరింగ్‌), ఆటోమేషన్‌ లాంటి స్పెషలైజ్డ్‌ ట్రైనింగ్‌ కోర్సుల పట్ల ఆసక్తి ఉంటే సీఐటీడీలో చేర్పించండి. సీఐటీడీలో అడ్వాన్స్‌డ్‌ ప్రోగ్రామ్స్‌, సిస్టమ్స్‌ నేర్చుకోవచ్చు. అయితే పాలిటెక్నిక్‌ చదివినవారికి జేఈఈ పరీక్ష రాసే అర్హత ఉండదు. సీఐటీడీలో డిప్లొమా చేసి, తర్వాత పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చదివితే ప్రభుత్వ ఉద్యోగం పొందే వీలుంటుంది. చదివిన స్పెషలైజేషన్‌కు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్‌ వచ్చినపుడు దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకోవచ్చు.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని