సైబర్‌ లా చేయాలంటే..?

పదో తరగతి తర్వాత దూరవిద్యలో బీఏ చేశాను. ఆ తర్వాత ఎంఏ (పాలిటిక్స్‌) చేసి, బీఈడీ (సోషల్‌-ఇంగ్లిష్‌) 2014లో పూర్తిచేశాను (2017లో ఏపీ ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఇంటర్‌ వన్‌ సిట్టింగ్‌లో పూర్తైంది). డీఎస్‌సీ రాశాను కానీ, ఉద్యోగం రాలేదు. నాకున్న వేరే ప్రభుత్వ ఉద్యోగావకాశాలేవి? ఇంకా వేరే ఏ కోర్సులైనా చేస్తే మేలా?

Published : 24 Jul 2017 02:53 IST

సైబర్‌ లా చేయాలంటే..?

* పదో తరగతి తర్వాత దూరవిద్యలో బీఏ చేశాను. ఆ తర్వాత ఎంఏ (పాలిటిక్స్‌) చేసి, బీఈడీ (సోషల్‌-ఇంగ్లిష్‌) 2014లో పూర్తిచేశాను (2017లో ఏపీ ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఇంటర్‌ వన్‌ సిట్టింగ్‌లో పూర్తైంది). డీఎస్‌సీ రాశాను కానీ, ఉద్యోగం రాలేదు. నాకున్న వేరే ప్రభుత్వ ఉద్యోగావకాశాలేవి? ఇంకా వేరే ఏ కోర్సులైనా చేస్తే మేలా?
- లక్ష్మి, తణుకు, పశ్చిమగోదావరి జిల్లా
* పీజీ అర్హతతో ఉన్న ఉద్యోగావకాశాలకు మీరు అర్హులు. రాష్ట్ర, కేంద్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల ద్వారా వెలువడే ఉద్యోగ ప్రకటనలకు దరఖాస్తు చేసుకుని, పోటీ పడేందుకు మీకు అర్హత ఉంది. ఎంఏ (పాలిటిక్స్‌) తో జూనియర్‌ లెక్చరర్‌గా ప్రయత్నించవచ్చు. ఏపీసెట్‌ లేదా యూజీసీ నెట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే డిగ్రీ లెక్చరర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి, ఈ ఉద్యోగ పరీక్షలకు సంసిద్ధమైతే తప్పకుండా విజయం సాధిస్తారు.

* డిగ్రీ (బీఏ కంప్యూటర్స్‌) పూర్తిచేశాను. సైబర్‌ లా చేయాలనుంది. సైబర్‌ లా, సైబర్‌ సెక్యూరిటీల మధ్య తేడా ఏంటి? సైబర్‌ లాను అందించే విశ్వవిద్యాలయాల వివరాలను తెలియజేయండి. ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?
- మహేష్‌ కోసగంటి
* ఇంటర్నెట్‌ ఆధారిత సేవలు, ఇంటర్నెట్‌ వాడకం, సైబర్‌ నేరాలు, వాటి చట్టపరమైన సమస్యల పరిష్కారం కోసం దేశంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం- 2000ను రూపొందించారు. దీనినే సైబర్‌ చట్టం/ సైబర్‌ లా అంటారు. కంప్యూటర్లు, నెట్‌వర్క్‌, డేటా అనధికార వాడకం, హ్యాకింగ్‌ల నుంచి పరిరక్షించే సాంకేతిక పరిజ్ఞానాన్నే సైబర్‌ సెక్యూరిటీ అంటారు.

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ వారు సంవత్సరం వ్యవధి గల పీజీ డిప్లొమా ఇన్‌ సైబర్‌లాస్‌ అండ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ కోర్సును దూరవిద్య విధానంలో అందిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ సైబర్‌ లా కోర్సును అందిస్తోంది. డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ కోర్సులకు అర్హులు. పెరిగిన ఇంటర్నెట్‌ వినియోగం దృష్ట్యా ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయి. లా ఫర్మ్స్‌, కార్పొరేట్‌, ఇన్‌కం టాక్స్‌ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని