ఎంబీఏ తర్వాత ఏ కోర్సులు మేలు?

ఎంబీఏ ఏ స్పెషలైజేషన్‌తో పూర్తిచేశారో తెలియజేయలేదు. ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూడటం కాకుండా ప్రయత్నం చేయండి. సాధారణంగా ఎంబీఏ పూర్తిచేసిన అభ్యర్థులు ఏదో ఒక ఉద్యోగాన్ని సాధించగలరు. ముందు మీరు ఏ రంగంలో ఉద్యోగాన్ని సాధించదలిచారో నిర్ణయించుకోండి...

Published : 06 Nov 2017 01:34 IST

ఎంబీఏ తర్వాత ఏ కోర్సులు మేలు?

ఎంబీఏ పూర్తిచేశాను. ఉద్యోగావకాశాల కోసం చూస్తున్నాను. భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఇంకా ఏవైనా కోర్సులు చేస్తే మేలా?
- కర్నాటి నరేష్‌

ఎంబీఏ ఏ స్పెషలైజేషన్‌తో పూర్తిచేశారో తెలియజేయలేదు. ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూడటం కాకుండా ప్రయత్నం చేయండి. సాధారణంగా ఎంబీఏ పూర్తిచేసిన అభ్యర్థులు ఏదో ఒక ఉద్యోగాన్ని సాధించగలరు. ముందు మీరు ఏ రంగంలో ఉద్యోగాన్ని సాధించదలిచారో నిర్ణయించుకోండి. తరువాత సాఫ్ట్‌స్కిల్స్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానం, బృందంతో పనిచేయడం, ఇంటర్వ్యూల కోసం సబ్జెక్టు పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం వంటివి చేయండి.

ఇక ఏవైనా కోర్సులు చేయాలనుకుంటే.. మీరు చదివిన స్పెషలైజేషన్లలో యాడ్‌ఆన్‌ కోర్సును ఎంచుకోండి. ప్రస్తుతం కంప్యూటర్‌ పరిజ్ఞానం ముఖ్యం కాబట్టి, ఎంఎస్‌ ఆఫీస్‌తోపాటు ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే మీ రెజ్యుమేను జాబ్‌ పోర్టళ్లలో అప్‌లోడ్‌ చేసుకోండి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని, ఉద్యోగ ప్రయత్నాలను ప్రారంభించండి, తప్పక విజయం సాధిస్తారు.

మా అమ్మాయి ఎం.ఫార్మసీ చదువుతోంది. ప్రభుత్వ లేదా ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా చేయాలనుకుంటోంది. ఎం.ఫార్మసీ తరువాత ఏం చదివితే/ చేస్తే తన కలను సాకారం చేసుకోగలదు?
- వి.ఎన్‌. రమేష్‌, విశాఖపట్నం

పాధ్యాయ వృత్తిలో అడుగుపెట్టాలన్న మీ అమ్మాయి ఆలోచన ప్రశంసనీయం. యూజీసీ వారి నిబంధన ప్రకారం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కావాలనుకునేవారు సీఎస్‌ఐఆర్‌ నెట్‌ ఉత్తీర్ణులు కావాలి. ఎం.ఫార్మసీ అభ్యర్థులు లైఫ్‌ సైన్సెస్‌ విభాగంలో నెట్‌కు సిద్ధం కావాల్సి ఉంటుంది.

నెట్‌ను అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కావడానికి కనీసార్హతగా పరిగణిస్తారు. పీజీ తరువాత పీహెచ్‌డీ చేస్తే ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశానికి మరింత దోహదపడుతుంది. సంబంధిత విశ్వవిద్యాలయం వారు నిర్వహించే ప్రవేశపరీక్ష- జీప్యాట్‌ ద్వారా లేదా నెట్‌లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా ఆయా విశ్వవిద్యాలయాల నిబంధనల ప్రకారం పీహెచ్‌డీలో ప్రవేశాన్ని పొందొచ్చు.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని