ఎంఎల్‌టీ చేయాలంటే ఎలా?

ఇంటర్‌ (బైపీసీ) పూర్తిచేశాను. బీఎస్‌సీ - ఎంఎల్‌టీ చేయాలనుంది. కోర్సు, అందించే సంస్థల వివరాలను తెలియజేయండి.

Published : 21 Nov 2017 01:47 IST

ఎంఎల్‌టీ చేయాలంటే ఎలా?

?ఇంటర్‌ (బైపీసీ) పూర్తిచేశాను. బీఎస్‌సీ - ఎంఎల్‌టీ చేయాలనుంది. కోర్సు, అందించే సంస్థల వివరాలను తెలియజేయండి.

డి.సందీప్‌

జ: బీఎస్‌సీ- మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ కోర్సు చేయదలచిన విద్యార్థులు ఇంటర్‌ బైపీసీ లేదా ఒకేషనల్‌ కోర్స్‌ ఇన్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ పూర్తిచేసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌.టి.ఆర్‌. హెల్త్‌ యూనివర్సిటీ, తెలంగాణలో కాళొజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌, వాటి అనుబంధ కళాశాలల్లో ఈ కోర్సును అభ్యసించడానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ప్రకటన విడుదల చేస్తాయి. రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ ఆశ్రమ్‌ కాలేజ్‌, ఏలూరు; గుంటూరు మెడికల్‌ కళాశాల, గుంటూరు; షాదన్‌ కళాశాల, హైదరాబాద్‌; ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ వంటివి ఈ కోర్సును అందిస్తున్న ముఖ్యమైన విద్యాసంస్థలు.

ప్రొ.బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని