డిగ్రీ మార్కులు పెంచుకోవచ్చా?

దూరవిద్య విధానంలో డిగ్రీ 44% మార్కులతో 2010లో పూర్తి చేశాను. నా మార్కుల శాతాన్ని ఓడీఈ (ఆన్‌ డిమాండ్‌ ఎగ్జామినేషన్‌)....

Published : 21 Nov 2017 01:48 IST

డిగ్రీ మార్కులు పెంచుకోవచ్చా?

?దూరవిద్య విధానంలో డిగ్రీ 44% మార్కులతో 2010లో పూర్తి చేశాను. నా మార్కుల శాతాన్ని ఓడీఈ (ఆన్‌ డిమాండ్‌ ఎగ్జామినేషన్‌) ద్వారా పెంచుకోవాలనుకుంటున్నాను. కుదురుతుందా? దీనికి సంబంధించిన వివరాలు తెలియజేయగలరు.

సి.నాగబాబు

జ: ఓడీఈ (ఆన్‌ డిమాండ్‌ ఎగ్జామినేషన్‌) ముఖ్య ఉద్దేశం- కోర్సు వ్యవధిని పూర్తిచేసుకుని కూడా టర్మ్‌ ఎండ్‌ ఎగ్జామినేషన్‌ కోసం వేచిచూస్తూ, వీలును బట్టి పరీక్షలను రాయాలనుకునే వారికి వీలును కల్పించడం. పరీక్ష ఫెయిల్‌ అయినవారు సమయం వృథా కాకుండా తిరిగి త్వరగా పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాలనుకునేవారికి వీలు కల్పించే ప్రయత్నమిది. ఒకసారి కోర్సులో ఉత్తీర్ణత పొంది, సంవత్సరాలు గడిచిన తర్వాత మార్కులు పెంచుకునే మార్గం మాత్రం కాదు.

మార్కులను పెంచుకోవడానికి విద్యార్థులకు విశ్వవిద్యాలయాలు ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షల ద్వారా అవకాశం కల్పిస్తాయి. వీటిని రాసి మార్కులు పెంచుకోవాలనుకుంటే సంబంధిత విశ్వవిద్యాలయాల నిబంధనల ప్రకారం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఈ అవకాశం డిగ్రీ పాసైన మూడేళ్లలోపు మాత్రమే (విశ్వవిద్యాలయాన్ని బట్టి) ఉంటుంది. మరిన్ని వివరాలకు ఒకసారి మీరు డిగ్రీ (దూరవిద్య) చదివిన విశ్వవిద్యాలయాన్ని సంప్రదించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు