భిన్నమైన కోర్సుల్లో చేరాలంటే..?

ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతున్నాను. ఇంటర్‌ తర్వాత డిగ్రీ, ఇంజినీరింగ్‌ కాకుండా కొత్త కోర్సులను చదవాలనుకుంటున్నాను.

Published : 30 Nov 2017 01:37 IST

భిన్నమైన కోర్సుల్లో చేరాలంటే..?

ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతున్నాను. ఇంటర్‌ తర్వాత డిగ్రీ, ఇంజినీరింగ్‌ కాకుండా కొత్త కోర్సులను చదవాలనుకుంటున్నాను. నాకు అందుబాటులో ఉన్న అవకాశాలను తెలపండి. ?- వాహిని, కొత్తగూడెం.

జ: విద్యార్థులందరూ ఇంజినీరింగ్‌, మెడిసిన్‌లవైపు పరుగులెడుతున్న ఈ తరుణంలో కొత్త కోర్సులను ఎంచుకోవాలనుకున్న మీ అభిరుచికి అభినందనలు. ప్రతీ కోర్సూ తనదైన ప్రత్యేకతలతో చదివినవారికి అవకాశాలను కల్పిస్తుంది. ముందుగా మీ అభిరుచికి తగ్గ, ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకోండి. మీకు వంటలపట్ల ఆసక్తి ఉంటే 10+2 తర్వాత కలినరీ మేనేజ్‌మెంట్‌ కోర్సులనూ, టూరిజం, కొత్త ప్రదేశాలపట్ల ఆసక్తి ఉంటే బీఎస్‌సీ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌నూ చదవొచ్చు. కళలపై ఆసక్తి ఉంటే బ్యాచిలర్స్‌ ఇన్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లో, విద్యారంగం, బోధనపట్ల ఆసక్తి ఉంటే డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌లో చేరవచ్చు. నిశితంగా పరిశీలించే తత్వం, సమయస్ఫూర్తి మీ సొంతమై, నేర సంఘటనలపై అధ్యయనం చేయాలనుకుంటే ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సు ఎంచుకోవచ్చు. ఏ రంగంలో అయినా రాణించాలంటే ముఖ్యంగా దాని పట్ల ఆసక్తి, ఇష్టం పెంచుకుని కృషి చేయడం తప్పనిసరి. అప్పుడే విజయం సాధించగలరు.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు