కలర్‌ బ్లైండ్‌నెస్‌ అడ్డంకా?

నాకు పోలీసు అవ్వాలని కోరిక. ఇటీవల జరిగిన రైల్వే ఉద్యోగానికి నిర్వహించిన మెడికల్‌ టెస్టులో నాకు కలర్‌ బ్లైండ్‌నెస్‌ ఉందని తెలిసింది.

Published : 30 Nov 2017 01:41 IST

కలర్‌ బ్లైండ్‌నెస్‌ అడ్డంకా?

నాకు పోలీసు అవ్వాలని కోరిక. ఇటీవల జరిగిన రైల్వే ఉద్యోగానికి నిర్వహించిన మెడికల్‌ టెస్టులో నాకు కలర్‌ బ్లైండ్‌నెస్‌ ఉందని తెలిసింది. దాంతో ఉద్యోగం కోల్పోయాను. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పోలీసు ఉద్యోగాలకైనా నాకు అర్హత ఉంటుందా? అసలు నేను ఏయే ఉద్యోగాలకు అర్హుడినో తెలపగలరు?- ఎ. శివప్రసాద్‌, పార్వతీపురం

జ: మీ విద్యార్హతలను తెలుపలేదు. పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగానికి కనీస అర్హత 10+2. ఎస్‌.ఐ., ఎ.ఎస్‌.ఐ. ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్‌ను కనీస అర్హతగా పరిగణిస్తారు. కలర్‌ బ్లైండ్‌నెస్‌ ఉన్న అభ్యర్థులను రాష్ట్ర ప్రభుత్వ పోలీసు ఉద్యోగాలకు అనర్హులుగా పరిగణిస్తారు. మీకు ఇతర ప్రభుత్వ శాఖల్లో ఆఫీసులో పనిచేసే ఉద్యోగాలకు అర్హత ఉంటుంది. మీకు అర్హత ఉంటే.. గ్రూప్‌ - 1, 2, 3, 4 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ కలర్‌ బ్లైండ్‌నెస్‌ ఉన్నా విజయాన్ని చేరుకున్నాడు. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ఉద్యోగ ప్రయత్నాన్ని మొదలుపెట్టండి. అందుకు తగ్గ సన్నద్ధతను ప్రారంభించండి. తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని